Begin typing your search above and press return to search.

ఆర్టీసీ బస్సు బీభస్తానికి బలైన టిసిఎస్ ఉద్యోగి !

By:  Tupaki Desk   |   26 Nov 2019 10:35 AM GMT
ఆర్టీసీ బస్సు బీభస్తానికి బలైన టిసిఎస్ ఉద్యోగి !
X
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు , తెలంగాణ ప్రభుత్వం ఎవరికీ వారు బెట్టు వీడక పోవడంతో అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. అదేంటి ఆర్టీసీ సమ్మెకు , ప్రభుత్వానికి ..అమాయకుల ప్రాణాలకి ఉన్న సంబంధం ఏమిటి అని అనుకుంటున్నారా ? అవునండి ఒక దిశా నిర్దేశం లేకుండా ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మె , ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల అమాయకుల ప్రాణాలకి రక్షణ లేకుండా పోతుంది. ఆర్టీసీ కార్మికులు సమ్మె లోకి వెళ్లడంతో ..ప్రభుత్వం ప్రజల అవసరాల కోసం తాత్కాలిక డ్రైవర్లని ఏర్పాటు చేసి బస్సులని నడిపిస్తున్నారు. కానీ , డ్రైవర్లకు సరైన శిక్షణ లేక పోవడం, ఇష్టం వచ్చినట్టు నడుపుతుండటంతో రోజు కి ఎక్కడో ఒక చోట ప్రమాదం జరుగుతూనే ఉంది.

గత పదేళ్లుగా ఆర్టీసీ లో నమోదైన ప్రమాదాల కంటే .. తాజాగా ఆర్టీసీ కార్మికులు సమ్మె లోకి వెళ్లిన తరువాత తాత్కాలిక డ్రైవర్లు చేసిన యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి అని కొందరు నిపుణులు చెప్తున్నారు. తాజాగా తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యానికి మరో నిండు ప్రాణం బలైపోయింది. హైదరాబాద్ బంజారాహీల్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్ నెంబర్ 12లో స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటీపై ప్రయాణిస్తున్న మహిళ తల పై నుంచి బస్సు వెళ్లడం తో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

దీంతో ఆగ్రహించిన జనం ఒక్కసారిగా తాత్కాలిక బస్సు డ్రైవర్‌ పై దాడికి దిగారు.మృతురాలు టాటా కన్సల్టెన్సీ లో పనిచేస్తున్న సోహిని సక్సేనాగా గుర్తించారు. అయితే దీనికి ప్రధాన కారణం ప్రభుత్వమే అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ఇదిలా ఉంటే ..ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి విధుల్లోకి వస్తాం అని చెప్పిన ..ప్రభుత్వం వారిని విధుల్లోకి తీసుకోలేదు. దీనిపై లేబర్ కోర్టులో కేసు నడుస్తున్న కారణం గా లేబర్ కోర్టు చెప్పే తీర్పుని బట్టి ఈ సమ్మె పై సీఎం కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.