Begin typing your search above and press return to search.
ఆ క్రికెటర్ పెళ్లాంతో పారిపోయాడు
By: Tupaki Desk | 9 Sept 2015 10:25 AM ISTపేరు ప్రఖ్యాతులున్న అహంకారమో.. మరేమో కానీ.. అనవసరంగా తప్పులు చేసి తిప్పలు పడటం కొందరికి మామూలుగా మారింది. తాజాగా బంగ్లాదేశ్ క్రికెటర్ పరిస్థితి చూస్తే ఇది నిజం అనిపించక మానదు. బంగ్లా క్రికెటర్ షహదత్ హుస్సేన్ కోసం ఆ దేశ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
తన భార్యతో కలిసి ఈ క్రికెటర్ పనిమనిషిపై జులుం చేసి.. హింసించిన ఘటనకు సంబంధించిన వీరిపై కేసు నమోదు అయ్యింది. వీరిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. కేసు వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే పెళ్లాంతో సహా పరారీ అయ్యాడు. బంధువులతు.. మిత్రులు.. సన్నిహితులు ఎవరికి అందుబాటులో లేకుండా పోయిన ఇతని కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
38 టెస్ట్ లు.. 51 వన్డే మ్యాచ్ లు ఆడిన షహదత్.. పదకొండేళ్ల పనమ్మాయిపై చేయి చేసుకోవటం.. గాయపర్చిన ఉదంతం బయటకు రావటం.. బాధితురాలు ఆ దేశ ఛానల్ లో మాట్లాడటంతో ఇతగాడిపై ఉచ్చు బిగిసింది.
షహదత్ దంపతుల ఆచూకీ కోసం బంగ్లా పోలీసులు ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండటం లేదట. ఇతని ఆచూకీ పోలీసులకే కాదు.. ఆ దేశ క్రికెట్ సభ్యులకు కూడా లభించకపోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏలాగైనా సరే.. ఇతగాడ్ని అదుపులోకి తీసుకోవాలన్న పట్టుదలతో బంగ్లా దేశ పోలీసులు ఉన్నారట. వెధవ పనులు చేయటం ఎందుకు? భయంతో పరుగులు తీయటం ఎందుకు? ఇంట్లో పని చేసే వారి పట్ల మానత్వంతో వ్యవహరిస్తే ఇలాంటి తిప్పలు ఉండవు కదా?