Begin typing your search above and press return to search.
రూల్ మార్చారు.. ఆ దేశంలో ఇక రేప్ చేస్తే ఉరే
By: Tupaki Desk | 13 Oct 2020 12:15 PM ISTప్రపంచ వ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. దీంతో చట్ట సవరణ అనివార్యమవుతోంది. తాజాగా అలాంటి పరిస్థితే బంగ్లాదేశ్ లో నెలకొంది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఇటీవల కాలంలో ఆ దేశంలో అత్యాచారాలు భారీగా పెరిగిపోతున్నాయి. నిందితులకు విధించే యావజ్జీవం బదులు ఉరి తీయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. అత్యాచారాలకు ఉరే సరి.. అంటూ నినాదాలే కాదు.. పెద్ద ఎత్తున ఆందోళన వెల్లువెత్తుతున్నాయి. దీంతో తాజాగా షేక్ హసీనా ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. రేప్ నేరానికి పాల్పడే వారికి ఉరిశిక్ష విధించేలా కొత్తగా ఆర్డినెన్సును తీసుకొచ్చారు.
బంగ్లాదేశ్ లో గడిచిన కొంతకాలంలో అత్యాచార నేరాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. గడిచిన తొమ్మిది నెలల కాలంలో వెయ్యి అత్యాచార కేసులు నమోదు కావటం గమనార్హం. దీంతో నిరసనలు అంతకంతకూ పెరగటమే కాదు.. సోషల్ మీడియాలో షేక్ హసీనా ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో నిరసనలు పెల్లుబుకుతున్నాయి. దీంతో దిగి వచ్చిన హసీనా ప్రభుత్వం కఠిన చర్యల దిశగా అడుగులు వేసింది.
కొద్ది రోజుల క్రితం దేశ రాజధాని ఢాకాకు 200కి.మీ. దూరంలో ఉన్న ప్రాంతంలో ఒక మహిళపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు.. ఆ దుర్మార్గాన్ని వీడియో తీసి వైరల్ చేశారు. దీనిపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు మొదలయ్యాయి. రేపిస్టులను క్షమించకూడదన్న డిమాండ్ అంతకంతకూ పెరిగింది.దీంతో.. అక్కడి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది.
ఈ నేపథ్యంలో.. తాజాగా కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. దీని ప్రకారం అత్యాచార కేసులో దోషిగా తేలితే వారికి ఉరిశిక్ష విదిస్తారు. గతంలో కేవలం యావజ్జీవ కారాగార శిక్ష మాత్రమే విధించేవారు. అందుకు భిన్నంగా ఇప్పుడు ఉరిని విధించేలా నిర్ణయం తీసుకున్నారు. మహిళలపై అత్యాచారాలు జరగటం పాతదే అయినా.. ఈ స్థాయిలో నిరసనలు.. ఆందోళనలు మాత్రం చరిత్రలో ఇదే తొలిసారిగా అక్కడి వారు చెబుతున్నారు.