Begin typing your search above and press return to search.

రాసలీలల సీడీ అప్ లోడ్ చేసింది బెంగళూరా? రష్యానా?

By:  Tupaki Desk   |   14 March 2021 11:30 AM GMT
రాసలీలల సీడీ అప్ లోడ్ చేసింది బెంగళూరా? రష్యానా?
X
సంచలనంగా మారిన బీజేపీ నేత.. కర్ణాటక రాష్ట్ర మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి రాసలీలల సీడీ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటివరకు సీడీలో ఉన్న యువతి ఆచూకీ బయటకు రాకపోవటంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటివేళ.. తాజాగా ఆమె ఒక వీడియోను అప్ లోడ్ చేసింది. తనను మాజీ మంత్రి రమేశ్ మోసం చేశారని.. ఉద్యోగం ఇస్తానని మాయమాటలు చెప్పినట్లుగా పేర్కొనటంతో పాటు.. తాను.. తన కుటుంబ సభ్యులు సూసైడ్ చేసుకోవటానికి ప్రయత్నించినట్లుగా పేర్కొంది. తనకు రక్షణ కల్పించాల్సిందిగా వేడుకొంది. తన వెనుక ఎలాంటి రాజకీయ అండ లేదని స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే.. ఈ కేసు లెక్క తేల్చటానికి ఏర్పాటు చేసిన అధికారుల టీం.. సీడీని ఎక్కడ నుంచి అప్ లోడ్ చేశారన్న అంశంపై ఫోకస్ చేశారు. ఇదిలా ఉండగా.. బెంగళూరు రూరల్ లోని విజయపుర పట్టణంలో ఉన్న బసవేశ్వర లేఔట్ లో నివాసం ఉంటున్న సురేశ్ శ్రవణ్.. అలియాస్ పెయింటర్ సూరి ఇంటికి భారీ ఎత్తున పోలీసులు వచ్చి సోదాలు నిర్వహించారు. కొన్ని సీడీలను.. కంప్యూటర్ ను సీజ్ చేశారు. సీడీ అప్ లోడ్ చేసినట్లుగా ఆరోపణలు ఉన్న శ్రవణ్ ఆచూకీ లభించకపోవటంతో.. అతని సోదరుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రాసలీలల సీడీని తన కంప్యూటర్ లో ఎడిటింగ్ చేయటంతో పాటు.. యూట్యూబ్ లో అప్ లోడ్ చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అయితే.. ఈ వీడియోను రష్యా నుంచి పోస్టు చేసినట్లుగా ఉంది. అయితే.. శ్రవణ్ ఐపీ అడ్రస్ ను ఎవరో రష్యాలో హ్యాక్ చేసి ఉంటారన్న మాట వినిపిస్తోంది. ఇక.. అతడి కంప్యూటర్ పాస్ వర్డ్ ఓపెన్ కాకపోవటంతో పలు సీడీలు.. పెన్ డ్రైవ్ లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కంప్యూటర్ ఓపెన్ అయితే..రాసలీలల సీడీ వ్యవహారం ఒక కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. ఇందుకోసం శ్రవణ్ కోసం గాలింపు మరింత తీవ్రతరం చేశారు.