Begin typing your search above and press return to search.
బైబై కర్ణాటక.. ఛలో తెలుగు స్టేట్స్
By: Tupaki Desk | 28 Oct 2015 9:46 AM ISTకర్నాటక ఒకప్పుడు అభివృద్ధికి నమూనా. ఐటీ కాంతి కిరణం. కాని కాంగ్రెస్ ప్రభుత్వ పుణ్యమా అని అంత గొప్ప పేరు ప్రఖ్యాతులూ కూడా ఇప్పుడు చెక్కలో కలిసిపోతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా దక్షిణ భారత్ లోనే విద్యుత్ కోత ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా కర్నాటక పేరుమోసింది. ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరు నగరంలో సైతం గత నెల రోజులుగా రోజుకు ఆరు గంటలపాటు విద్యుత్ సరఫరాలో కొత పెడుతున్నారంటే అక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ కరెంటు కోతల పరిస్థితి ఎంత తీవ్ర రూపం దాలుస్తున్నదంటే.. ఐటీ సహా ఉత్పాదక రంగానికి చెందిన అనేక పరిశ్రమలు కూడా.. ఆ రాష్ట్రాన్ని వదలిపెట్టి.. నిరంతరాయ విద్యుత్తు ఇవ్వడానికి పోటీ పడుతున్న తెలుగు రాష్ట్రాలను ప్రత్యమ్నాయంగ ఎంచుకునే పరిస్థితి వస్తున్నదిట.
గత పాతికేళ్లలో ఎన్నడూ లేనంత తీవ్ర విద్యుత్ కొరతను కర్నాటక ప్రస్తుతం ఎదుర్కొంటోంది. దీని ఫలితంగా రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలు, కంపెనీల నిర్వహణా ఖర్చులు తారాస్తాయికి చేరిపోయాయి. వచ్చే వేసవిలో పరిస్థితి ఇంకా దిగజారనుందని వార్తలు వస్తున్నాయి. విద్యుత్ సరఫరా విషయంలో చేతులెత్తేసిన కర్నాటక కాంగ్రెస్ వైఖరితో మదుపుదారులు ఇప్పటికే విసిగిపోయారని తెలుస్తోంది. దీంతో వీరు తమ ఉత్పత్తి యూనిట్లను ఇతర రాష్టాలకు తరలించాలని కూడా ఆలోచిస్తున్నాయని వినికిడి. ఇలాంటివాటికి తక్షణ గమ్య స్థానంగా తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కనిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు నిరంతర విద్యుత్ సరఫరా విషయంలో ప్రస్తుతం పోటీ పడుతున్న విషయం తెలిసిందే.
అంటే కాంగ్రెస్ పాలనా నిర్వాకం తెలుగు రాష్ట్రాలకు అనుకోని వరంలాగా ఉపయోగపడుతోందన్నమాట. కమ్యూనికేషన్ అనేది విచ్చలవిడిగా పెరిగిపోయిన ఈ రోజుల్లో కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు ఇతర ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ అవకాశాల మీద కూడా తప్పకుండా ప్రభావం చూపిస్తాయి.
ఆ సంగతులు ఎలా ఉన్నా.. కర్ణాటక వైఫల్యాలు తెలుగు రాష్ట్రాలకు వరంగా మారడం విశేషం. ఐటీకి బెంగుళూరు హబ్ అంటూ గుత్తాధిపత్యం చెలాయించే రోజులు ఇక త్వరలో సమసిపోవచ్చు. అసలే ఐటీ రంగంలో అనేక తాయిలాలతో విస్తరించడానికి ఏపీ - తెలంగాణ పోటీ పడుతున్నాయి. ఐటీ కారిడార్లను ఏర్పాటుచేస్తూ అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలను ఆహ్వానిస్తున్నాయి. ఈ ప్రత్యేకతలకు, పొరుగు రాష్ట్రంలో ఉన్న ఇబ్బందులు కూడా తోడైతే.. ఇక మన తెలుగు రాష్ట్రాల పంట పండినట్టే అనుకోవచ్చు.