Begin typing your search above and press return to search.
దండంపెట్టి మరీ.. బండ్ల గణేష్ వద్దన్నాడు
By: Tupaki Desk | 17 Sept 2020 1:40 PM ISTఏది మనకు సూట్ అవుతుందో చేయాలి. మన బలాబలాలు గ్రహించాలి. అత్యాశకు పోయి చేస్తే దెబ్బైపోతారు.. కొందరు మల్టీ టాలెంటెడ్స్ ఉంటారు. వాళ్లు సక్సెస్ అవుతారు. కానీ వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళితే మిగతా వారికి అచ్చి రాదు..
దక్షిణాదిన తారలు రాజకీయాల్లోకి వచ్చి వెలుగు వెలిగిన చరిత్ర ఉంది. తమిళనాట ఎంజీఆర్, జయలలిత, తెలుగునాట ఎన్టీఆర్ సక్సెస్ అయ్యారు. కన్నడ, మలయాళంలోనూ సినీ తారల ఉనికి ఉంది. అయితే ఎన్టీఆర్ తర్వాత స్థాయిలో రాజకీయాల్లో తారలు సక్సెస్ అయిన దాఖలాలు లేవు.
మొదట చిరంజీవి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇద్దరూ సినిమాల్లో అగ్రతారలు ఎదిగి రాజకీయాల్లో ఫ్లాప్ అయ్యారు. బాలయ్య పార్ట్ టైం పొలిటీషియన్ అయ్యారు. రోజాకు వైసీపీలో అగ్రతాంబూలం దక్కలేదు.
అయితే వీరి ఆశతో వెళ్లిన బండ్ల గణేష్ కు కూడా కాలం కలిసిరాలేదు. తెలంగాణ కాంగ్రెస్ లో చేరి ‘7ఓ క్లాక్ బ్లేడుతో కాంగ్రెస్ గెలవకుంటే గొంతు కోసుకుంటానని’ ఆయన ఎన్నిక వేళ చేసిన రచ్చ అంతా ఇంతాకాదు.. కానీ కాంగ్రెస్ పరాజయంతో బండ్ల రాజకీయమే ముగిసింది.రాజకీయాలకు గుడ్ బై చెప్పి సుబ్బరంగా మళ్లీ సినిమాల బాటపట్టాడు.
తాజాగా ఓ నెటిజన్ బండ్లకు ఓ అరుదైన ప్రశ్న వేశాడు. ‘బండ్ల అన్నా.. నువ్వు మళ్లీ బీజేపీలో చేరుతున్నావా?’ అని ట్విట్టర్ లో అడడగా.. బండ్ల గణేష్ చేతులెత్తి దండం పెట్టే సింబల్ పెట్టి ‘నో పాలిటిక్స్ బ్రదర్’ అంటూ తేల్చేశాడు. ఇక రాజకీయాల్లోకి రాను అంటూ తేల్చిచెప్పారు.
ఇటీవల అలీతో సరదాగా షోలోనూ ఇక సినిమాలే తన జీవితం అని.. నటుడిగా కంటే నిర్మాతగా 100మందికి ఉపాధి కల్పిస్తానని బండ్ల చెప్పుకొచ్చాడు.