Begin typing your search above and press return to search.
కేసీఆర్ అంటే బండ్లకు భయంతో కూడిన గౌరవం..
By: Tupaki Desk | 3 Oct 2018 12:46 PM ISTటాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టు నుంచి బడా నిర్మాతగా ఎదిగిన బండ్ల గణేష్ ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. సందర్భమేదైనా సరే ముందుకొచ్చి తన మార్క్ మాటలతో హీట్ పుట్టిస్తారు. టాలీవుడ్ లో నిర్మాతగా కొనసాగుతూనే తాజాగా ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ చేతులమీదుగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తన బాస్ జనసేనను కాదని ఆయన తీవ్రంగా విమర్శించే కాంగ్రెసోళ్ల పంచన చేరారు. అటు బాస్ కు వ్యతిరేకం కాదంటూ.. ఇటు తనకు కాంగ్రెస్ అంటే ప్రేమంటున్నాడు. సరే ఎవరి వ్యక్తిగత ఇష్టం వారిది అనుకుందాం.. కానీ కాంగ్రెస్ నేతగా అరవీర భయంకరంగా రెచ్చిపోతావా అంటే అదీ లేదంటున్నాడు. తాను ఫోకస్ కావాలి కానీ ప్రతిపక్ష పార్టీల పెద్దాయలను తిట్టి పేరు పొందనని భయపడిపోతున్నారు. తాజాగా బండ్ల గణేష్ ఓ తెలుగు న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో అదే విషయాన్ని స్పష్టం చేశారు..
కాంగ్రెస్ లో ఎవ్వరైనా సీఎం కావచ్చని బండ్ల అనడం విశేషం. సీల్డ్ కవర్ లో కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యారని.. రేపు తాను, అవసరమనుకుంటే జర్నలిస్టుగా మీరు కావచ్చని ప్రశ్నించిన జర్నలిస్టుకే పంచ్ వేశారు. ఇలాంటి స్వేచ్ఛ ప్రాంతీయ పార్టీల్లో సాధ్యమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ లో దున్నుకున్నోడికి దున్నుకున్నంత అని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శిస్తావా అని జర్నలిస్ట్ ప్రశ్నిస్తే .. ఆయన పెద్దాయన.. ఆయన పని ఆయన చేస్తుంటాడు. మా పని మేం చేస్తుంటామని బండ్ల గణేష్ స్పష్టం చేశారు...వ్యక్తిగతంగా విమర్శించమని.. ప్రతిపక్షంగా ప్రభుత్వ తప్పులు మాత్రమే ఎత్తిచూపుతామంటూ కొంత జాగ్రత్తగా మాట్లాడాడు. టీఆర్ఎస్ విధానాలు కొన్ని బాగాలేవు.. విమర్శిస్తాం.. కానీ కేసీఆర్ ను తానెందుకు విమర్శిస్తానంటూ తప్పించుకున్నారు. కేసీఆర్ ఏమైనా ఐటీ నోటీసులిస్తారని భయమా అని ప్రశ్నిస్తే.. అదే లేదంటూ రాజకీయాల్లోకి వచ్చాక ఇవన్నీ ఫేస్ చేయాల్సిదేనంటూ బండ్ల తప్పించుకున్నారు.
కాంగ్రెస్ లో ఉంటూ అధికార టీఆర్ఎస్ ను విమర్శించవా అని సదురు జర్నలిస్టు బండ్ల గణేష్ ను ప్రశ్నించాడు. దీంతో ఉండబట్టలేక ఇక అప్పుడు బైటకొచ్చాడు బండ్ల.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కోదండ, విమలక్క, గద్దర్ జైల్లో ఉంటున్నారని.. తెలంగాణను వ్యతిరేకించిన తుమ్మల, తలసాని, దానం ఇప్పుడు మంత్రులవుతున్నారని హాట్ కామెంట్ చేశారు. కానీ ఎక్కడా డైరెక్ట్ గా కేసీఆర్ ను మాత్రం టచ్ చేసే సాహసం చేయలేకపోయాడు. ఇలా కేసీఆర్ అంటే భయంతో కూడిన భక్తి వల్ల వచ్చిన గౌరవాన్ని తాజా ఇంటర్వ్యూల్లో బండ్ల బయటపెట్టాడు. అనవసరంగా కేసీఆర్ తో పెట్టుకుంటే చిక్కులు అనుకున్నాడేమో కానీ.. ఎక్కడా డైరెక్ట్ గా విమర్శలు చేయలేకపోయాడు.
వీడియో కోసం క్లిక్ చేయండి