Begin typing your search above and press return to search.

బండ్ల 7ఓ క్లాక్ బ్లేడ్ కథ.. ఏమవుతుందో..

By:  Tupaki Desk   |   22 Nov 2018 11:31 AM IST
బండ్ల 7ఓ క్లాక్ బ్లేడ్ కథ.. ఏమవుతుందో..
X
ఎన్నో ఆశలతో కాంగ్రెస్ లో చేరాడు. తనకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఆశపడ్డాడు. కానీ అది సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీ అని మరిచిపోయాడు. అన్ని కాలువలు వచ్చి అందులో చేరాల్సిందే.. అందులో సొంతంగా ఎదుగుదామంటే కుదరదని ఇప్పుడు బండ్ల గణేష్ కు అర్థమైంది.

‘కాంగ్రెస్ లో ఎగిరెగిరి దంచినా అదే కూలీ.. కూర్చొని దంచినా అదే కూలీ’ అని అప్పట్లో రేవంత్ రెడ్డి అన్నమాట ఇప్పుడు బండ్ల గణేష్ కు అక్షరాల సూటవుతుంది. కాంగ్రెస్ లో చేరిన కొత్తలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టు బండ్ల గణేష్ మాట్లాడిన వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బండ్ల అనే నేను అనే వీడియో వైరల్ అయ్యింది. చివరికి కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ లో బండ్ల బలిపశువు అయ్యాడు. ఇప్పుడు బయటకు చెప్పలేక.. బాధను మింగలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు.

తాజాగా మరోసారి వివాదాస్పద చాలెంజ్ చేసి బండ్ల గణేష్ ఇరుకున్నాడు. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే 7ఓ క్లాక్ బ్లేడ్ తో గొంతు కోసుకుంటానని ఓ ఇంటర్వ్యూలో సవాల్ విసిరాడు. డిసెంబర్ 11న కాంగ్రెస్ ఓడిపోతే బ్లేడ్ తో రావాలని.. గెలిస్తే స్వీటు బాక్స్ తో వచ్చి తనను ఇంటర్వ్యూ చేయాలని సదురు జర్నలిస్టును బండ్ల గణేష్ కోరారు.

ఇప్పటికే ‘బండ్ల గణేష్ అనే నేను’తో అభాసుపాలైన గణేష్ ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే గొంతు కోసుకుంటానని భీకర స్టేట్ మెంట్ ఇచ్చాడు. మరి డిసెంబర్ 11న ఫలితాల్లో తేడా వస్తే ఏంటీ పరిస్థితి అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. సినిమాల్లో కామెడీ చేయి రాజకీయాల్లో కాదు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. చూడాలి మరి బండ్ల 7ఓ క్లాక్ బ్లేడ్ కథ ఏ మలుపు తిరుగుతుందో..