Begin typing your search above and press return to search.
సడన్ గా పవన్ పై బండ్ల ప్రేమ.. ఏంటబ్బా?
By: Tupaki Desk | 27 Jan 2020 10:24 AM ISTబండ్ల గణేష్.. సినీ నటుడు, నిర్మాత.. రాజకీయాల్లోకి ఎంత వేగంగా దూసుకొచ్చాడో అంతే వేగంగా కనుమరుగైన నేతల్లో బండ్ల గణేష్ ముఖ్యుడు. సినిమాల్లో వెలుగు వెలిగి.. రాజకీయాల్లోనూ వెలగిపోదామని వచ్చిన ‘తారా’జువ్వలు తుస్సుమనడం కొనసాగుతోంది.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ప్రముఖ నటుడు, తెలుగు నిర్మాత బండ్ల గణేష్.. సీటు దక్కకపోవడంతో అతాషుడయ్యాడు. తరువాత కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా తెలంగాణ రాష్ట్రసమితి -కేసీఆర్ పాలన పై సంచలన కామెంట్ల తో వార్తల్లో నిలిచారు. కాంగ్రెస్ అధికారంలోకి రాక పోతే 7ఓ క్లాక్ బ్లేడ్ తో గొంతు కోసుకుంటానన్న ఈయన డైలాగ్ పాపులర్ అయ్యింది.
అయితే రాజకీయాల్లో నిండా మునిగిన బండ్ల గణేష్ ఎవ్వరూ ఊహించని విధంగా తత్త్వం బోధపడి రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఇక నుంచి నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాడిని కాదు.. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నా విమర్శలు, వ్యాఖ్యల పట్ల బాధ పడ్డ వారందరినీ పెద్ద మనసు తో క్షమించమని కోరుతున్నాను అని బండ్ల గణేష్ బాధతాప్త హృదయంతో ఓ ఫైన్ మార్నింగ్ అప్పట్లో ట్వీట్ చేయడం రాజకీయంగా, సినిమాలోకంలో సంచలనమైంది.
కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తన ఆప్త మిత్రుడు, దేవుడు అని ప్రకటించిన జనసేనాని పవన్ కళ్యాణ్ గురించి ఏ కామెంట్ చేయలేదు.. ప్రస్తావించలేదు. సైలెంట్ గా ఉన్నారు. అయితే రాజకీయాల కాడి వదిలేశానన్న బండ్ల గణేష్ తాజాగా చాలా రోజులు గ్యాప్ ఇచ్చి మళ్లీ పవన్ నామ స్మరణ చేయడం హాట్ టాపిక్ గా మారింది. పవన్ ను వ్యతిరేకించి కాంగ్రెస్ లో చేరి వైదొలిగాక ఇంత కాలానికి మళ్లీ పవన్ గుర్తుకు రావడం విశేషం.
తాజాగా బండ్లగణేష్ పవన్ ఫొటోను షేర్ చేసి ట్వీట్ చేశారు. ‘నేను భయంతో రాలేదు.. బాధ్యతతో వచ్చాను’ అనే ట్యాగ్ లైన్ ను జోడించారు. ‘ఇది నిజం’ అంటూ పవన్ కళ్యాణ్ ను ట్యాగ్ చేశారు. ఇలా సడన్ గా పవన్ పై బండ్ల గణేష్ కు ప్రేమ పుట్టికొచ్చింది. మరి మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారా లేదా చూడాలి.
ఇటీవలే ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో మళ్లీ నటుడి గా రీఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్ కు అది వర్కవుట్ కాలేదు. దీంతో మళ్లీ రాజకీయాల బాట పెట్టాడా అన్న చర్చ సాగుతోంది.