Begin typing your search above and press return to search.
నా దైవం పవన్ ని అంటే ఊరుకోను..ప్రకాష్ రాజ్ పై బండ్ల ఫైర్
By: Tupaki Desk | 2 Dec 2020 8:55 AM ISTఎవరైనా పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకుంటే సహించను.. ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిస్తే అసలే సహించేది లేదు. ఆయన నా దైవం అని అన్నారు బండ్ల గణేష్. పరిశ్రమకు ఎంతో ట్యాలెంట్ ని పరిచయం చేసిన ఘనత పవన్ కల్యాణ్ కి ఉంది. ఎలక్షన్ టైం లో మాట్లాడటం ధర్మం కాదని రాజకీయాలు మాట్లాడకూడదని నేనేం మాట్లాడలేదు అంటూ వరుస ట్వీట్లలో ప్రకాష్ రాజ్ పై ఫైరయ్యారు బండ్ల.
నటుడు కం నిర్మాత బండ్ల గణేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. GHMC ఎన్నికల వేళ గత కొన్ని రోజులుగా జనసేనాని పవన్ కల్యాణ్ నిరంతరం వార్తల్లో నిలిచారు. ఆ క్రమంలోనే ప్రకాష్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో ఊసరవెల్లి అంటూ వ్యాఖ్యానించడం అభిమానుల్లో అగ్గి రాజేసింది.
ఎలక్షన్ వేళ సైలెంట్ గా ఉన్న బండ్ల ఇప్పుడు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఫైరయ్యారు. పవన్ పై తన అభిమానాన్ని.. విధేయతను ప్రదర్శిస్తూ గణేష్ ట్విట్టర్ లో వరుస ట్వీట్లను పోస్ట్ చేశాడు. ఎన్నికల సమయం కారణంగా ఈ రోజుల్లో మౌనంగా ఉండిపోయానని గణేష్ అన్నారు.
పవన్ కళ్యాణ్ మహోన్నతమైన వ్యక్తి. రాజకీయాలు ఎవరైనా చేసుకోవచ్చు రాజకీయాలు ఎవరైనా మాట్లాడుకోవచ్చు.. కానీ వ్యక్తిత్వం గురించి.. పవన్ కళ్యాణ్ గురించి ఎవరు మాట్లాడినా నేను సహించను. పవన్ కళ్యాణ్ నా దృష్టిలో ఎప్పటికీ దైవంతో సమానం.
ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు.. ఎంతో మంది సాంకేతిక నిపుణులు ఎంతోమంది నిర్మాతల్ని పరిచయం చేసిన ఘనత మా దైవం పవన్ కళ్యాణ్ ది.
నిజాయితీకి నిలువుటద్దం పవన్ కళ్యాణ్. నాకు కృతజ్ఞత అనేది నా రక్తంలో ఉంది. నేను ఈరోజు అనుభవిస్తున్న ఈ స్థాయి నాకు పవన్ కళ్యాణ్ పెట్టిన భిక్ష అని బండ్ల గణేష్ వరుస ట్వీట్లతో చెలరేగారు.
నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు.. రాజకీయాలతో సంబంధం లేదు కానీ పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం. ఆయన వ్యక్తిత్వం.. నిజాయితీ.. నిబద్ధత నాకు తెలుసు అని బండ్ల అన్నారు. కొన్నేళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో పలువురు యువ ఆశావాదులకు పవన్ ప్రాణం పోశారని గణేష్ అన్నారు.