Begin typing your search above and press return to search.
బండ్ల ఎక్కడా దొరకడేం.. హడలెత్తిస్తున్నాడే..
By: Tupaki Desk | 31 Oct 2018 4:53 PM ISTమొన్న మూర్తి.. ఆ తర్వాత జాఫర్.. నేడు నాగరాజు ఇలా ప్రముఖ జర్నలిస్టులకే షాకుల మీద షాకులు ఇస్తూ.. వారినే అదిలించి బెదిలించి తను ఎక్కడ తొణగకుండా బండ్ల గణేష్ ఇంటర్వ్యూల్లో నట విశ్వరూపమే చూపిస్తున్నాడు. అసలు సిసలు రాజకీయ నేతగా చెడుగుడు ఆడేస్తున్నాడు. ఓ పాతికేళ్లు రాజకీయాల్లో ఉన్న నాయకుడిలా జర్నలిస్టులకు ఎక్కడా దొరక్కకుండా వారినే డిఫెన్స్ లోకి నెట్టేలా బండ్ల గణేష్ వ్యవహరిస్తుండడం వివాదాస్పదమవుతోంది..
తాజాగా ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ సదురు ప్రశ్నలు అడిగినే జర్నలిస్టుతోనే గొడవకు దిగాడు. వివాదాల్లో లాగొద్దు.. కాంట్రవర్సీ.. మీ రేటింగ్ కోసం నన్ను ఇంటర్వ్యూ చేయవద్దంటూ శివాలెత్తాడు.. లక్ష రూపాయలు ఇస్తే పాజిటివ్ గా ఇంటర్వ్యూ చేస్తారా అంటూ ఆశ కూడా చూపారు..
ఇలా సామ, దాన, బేధ దండోపాయాలు మేళవిస్తూ దిగ్గజ జర్నలిస్టులకు ఎక్కడ దొరక్కుండా బండ్ల ఇంటర్వ్యూలు ఇస్తుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఏ చిన్న టాపిక్ అయినా అందులో ఇరికిద్దామని ఎంతగా ప్రయత్నించినా బండ్ల దొరకకుండా ఎదురుదాడి చేస్తున్నాడు.
తాజాగా కాంగ్రెస్ కూటమితో జతకట్టిందని మీకు బలం లేదని అలా చేశారా.? అని జర్నలిస్టు ప్రశ్నించగానే బండ్ల సీరియస్ అయ్యాడు. అలాగే మీకు ఇష్టదైవమైన పవన్ కళ్యాణ్ టీఆర్ఎస్ కు మద్దతిస్తున్నాడని.. ఆయన మీ కాంగ్రెస్ ను, మిమ్మల్ని తిడితే ఎలా ఫీల్ అవుతారని బండ్ల గణేష్ ను ప్రశ్నించగానే తట్టుకోలేకపోయాడు. వెంటనే ఇక్కడి నుంచి లేచి వెళ్లిపోవాలని జర్నలిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్-తనకు మధ్య మంచి సంబంధాలు చెడగొట్టవద్దంటూ ఏకంగా ఇంటర్వ్యూనే క్యాన్సిల్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రాజకీయాల్లో ఓర్పు నేర్పుతో ఉంటేనే రాణించగలం.. అలాంటిది బండ్ల గణేష్ ప్రశ్నించే జర్నలిస్టులు, ఇతరులపై ఇంతెంతున లేస్తూ ఫైర్ అవుతున్నారు. ఈ ధోరణి ఆయనకు చేటు తెస్తుందంటున్నారు సీనియర్ నేతలు.. చూడాలి మరి బండ్ల సినిమాల్లో హిట్ అయినట్టే రాజకీయాల్లోనూ రాణిస్తాడా ఈ ఫైర్ ముందు ముందు కూడా కొనసాగిస్తాడా అన్నది..