Begin typing your search above and press return to search.
బండ్ల గణేష్ మళ్లీ పవన్ కు ముఖం చూపిస్తావా.?
By: Tupaki Desk | 24 Sept 2018 2:17 PM ISTపవన్ కళ్యాణ్ అంటే ఊగిపోయే భక్తుల్లో బండ్ల గణేష్ ఒకరు. పవన్ ను వివిధ వేదికలపై తన దేవుడు అంటూ ఆకాశానికెత్తేశాడు. పవన్ ను ఎవరైనా ఏమైనా అన్నా ఎదురు నిలబడే మొదటి వ్యక్తుల్లో బండ్ల ఒకరు. ఈ పరమ వీర భక్తుడు ఇప్పుడు పవన్ కళ్యాన్ తీవ్రంగా వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే తాజాగా ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న బండ్ల గణేష్,,, పవన్ కళ్యాణ్ పై అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.
బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ‘తాను కాంగ్రెస్ లో చేరినంత మాత్రాన.. ఇక పవన్ కళ్యాణ్ ముఖం చూడను అనేది అవాస్తవం.. మా నాన్న బండ్ల నాగేశ్వరరావు అయితే.. నా దేవుడు పవన్ కళ్యాణ్ అన్నది అంతే వాస్తవం’ అని పవన్ పై ప్రేమను చాటుకున్నాడు. పవన్ తనకు జీవితాన్ని ఇచ్చాడని.. ఆయన ఎప్పటికీ తన బాసే నని స్పష్టం చేశారు. రాజకీయాలకు - వ్యక్తిగతానికి సంబంధం లేదని బండ్ల వివరణ ఇచ్చారు. నాకు ఇష్టమైన పార్టీ కాంగ్రెస్ అని.. పవన్ మార్గం వేరు అని తేల్చిచెప్పారు.
‘‘కాంగ్రెస్ కే హఠావో.. దేశ్ కో బచావో అన్న పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ ను తీవ్రంగా వ్యతిరేకించారు. దేశం ఈ పరిస్థితుల్లో ఉండడానికి కాంగ్రెసే కారణమన్నారని.. మీరు అదే పార్టీలో చేరారు.?’’ అని బండ్ల గణేష్ ను జర్నలిస్టు సూటిగా ప్రశ్నించారు. దీనికి బండ్ల.. పవన్ అలా ఎప్పుడూ అనలేదని బుకాయించాడు. దీంతో జర్నలిస్టు ఆ వీడియోను ప్లే చేయమంటారా అని ప్రశ్నించగా.. ఒకవేళ అంటే అనుండొచ్చు. పవన్ గురించి మాట్లాడే స్థాయి నాకు లేదంటూ మెల్లిగా తప్పించుకున్నారు.
పవన్ కళ్యాణ్ ఎప్పటికీ తన బాసేనని.. ఆయనతో సినిమాలు కూడా చేస్తానని బండ్ల స్పష్టం చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీతో విభేదించి ఉండొచ్చని.. అలాంటి పార్టీలో నేను చేరి ఉండొచ్చని.. కానీ పార్టీలు వేరు అయినా మా బంధం మాత్రం ఎప్పటికీ నిలిచిఉంటుందంటూ బండ్ల వివరణ ఇచ్చారు. ఈ రెండింటికి ముడిపెట్టవద్దని కోరారు.