Begin typing your search above and press return to search.

బ్యాంకుకి బండ్ల 100 కోట్ల ఎగనామం.?

By:  Tupaki Desk   |   23 Nov 2018 10:40 AM IST
బ్యాంకుకి బండ్ల 100 కోట్ల ఎగనామం.?
X
బండ్ల గణేష్.. ఈ సీరియస్ కామెడీ పొలిటీషియన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ‘బండ్ల అనే నేను’ అంటూ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేసి వైరల్ అయిన బండ్లకు కాంగ్రెస్ అదిరిపోయే షాక్ ఇచ్చింది. సీటు కోసం చేరితే‘హ్యాండి’చ్చింది. ఆ దెబ్బతో ఎన్నో ఆశలతో కాంగ్రెస్ లో చేరిన బండ్ల గణేష్ ఇప్పుడు ఏం చేయాలో పాలుపోక సతమతమవుతున్నారు.

కాంగ్రెస్ సీటు వస్తుందని ఎన్నో ప్రగల్బాలు పలికిన ఈయన్ను ఇప్పుడు టీవీ చానెల్స్ అన్ని కూర్చుండబెట్టి మరీ ఓదారుస్తున్నాయి. ఏమైందీ మీసీటు.. కాంగ్రెస్ లో చేరి మోసపోయారా అని అడుగుతున్నాయి.. దానికి మింగలేక.. కక్కలేక కవర్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

తాజాగా వివాదాస్పద జర్నలిస్టు మూర్తి మరోసారి తన చానెల్ లో బండ్ల గణేష్ తో చిట్ చాట్ నిర్వహించాడు. ఈసారి బండ్లకు నీళ్లు తాగించే ప్రశ్నలేశారు. నెటిజన్లు అడుగుతున్నారంటూ బండ్ల గణేష్ ఆంధ్రా బ్యాంకుకు 100 కోట్లు ఎగనామం పెట్టిన విషయాన్ని లేవనెత్తాడు. ముందు అప్పులు లేవని దబాయించిన బండ్ల ఆ తర్వాత తనకు 47 కోట్లకు పైగా అప్పు ఉందని చెప్పుకొచ్చాడు. అదీ మా అన్నయ్య పేరు మీద ఉందని.. 10 నెలల్లో ఒక నెల ఎన్పీ పెడుతూ తాము కట్టలేకపోయేది నిజమేనని ఒప్పుకున్నాడు. అంతామాత్రానా తాము బ్యాంకులకు ఎగొట్టడం లేదని.. తమ 200 కోట్ల ఆస్తులు బ్యాంకులో తాకట్టు పెట్టామని బండ్ల వివరణ ఇచ్చాడు.

ఒక హీరోను మోసం చేశామన్న ప్రశ్నకు కూడా బండ్ల సమాధానం దాటవేశాడు. తాను సచిన్ అనే హీరోతో సినిమా తీశానని.. కానీ అది అభిప్రాయ బేధాలకు దారితీసిందని వివరణ ఇచ్చారు. ఇలా బండ్ల గుట్టు తవ్వినకొద్దీ ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి..