Begin typing your search above and press return to search.
కేసీఆర్‌పై బండి మాటల తూటాలు.. ఏమన్నారంటే
By: Tupaki Desk | 6 April 2022 3:30 PM ISTసిద్ధాంతాల పునాదిపై.. ప్రజల శ్రేయస్సు కోరి పనిచేసే పార్టీలకే దేశంలో మనుగడ ఉందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ ఎస్.. ప్రభుత్వం కేంద్ర సర్కార్‌ను బద్నాం చేస్తోందని మండిపడ్డారు. హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్జీ జెండాను ఎగురవేశారు. సిద్ధాంతాల పునాదుల మీద పనిచేసే పార్టీలకే దేశంలో మనుగడ ఉందని బండి సంజయ్ స్పష్టం చేశారు.
భారత్‌ను ప్రపంచంలోనే విశ్వగురువు స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్న బీజేపీని.. రాష్ట్రంలోనూ అధికారంలోకి తెచ్చేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. తెలంగాణ సర్కార్ అటు విద్యుత్ ఛార్జీలు.. ఇటు ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపుతోందని మండిపడ్డా రు. ఉద్యోగ నోటిఫికేషన్ల పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తోందని విమర్శించారు.
"సీఎం కేసీఆర్..బీజేపీని, కేంద్ర సర్కార్‌ను అప్రతిష్ట పాలుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. కరెంటు ఛార్జీలు పెంచి రైతులను మోసం చేస్తున్నారు. నోటిఫికేషన్ల పేరుతో నిరుద్యోగులను మోసం చేసేందుకు కుట్ర పన్నారు. ఎలాంటి ఎన్నికలు వచ్చినా.. తెలంగాణ రాష్ట్రంలో కమలం జెండా ఎగిరేలా కార్యకర్తలం తా కష్టపడి పనిచేయాలి." అని సంజయ్ అన్నారు.
బీజేపీ కార్యకర్తలకు ఇవాళ పండగ రోజని అన్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పార్టీ నిర్మాణంలో అనేక మంది త్యాగాలు ఉన్నాయన్నారు. నమ్మిన సిద్ధాంతాల కోసం నిత్యం పోరాడుతూ చావుకు కూడా వెనుకాడని నైజం బీజేపీ కార్యకర్తలదని అన్నారు. అధికారం కోసం కాదు.. నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేసే పార్టీ బీజేపీ అన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ త్యాగం వృధా కాలేదని చెప్పారు.
రెండు సీట్లతో ప్రారంభమైన పార్టీకి ఇవాళ 300కుపైగా ఎంపీలు ఉన్నారంటే పార్టీ సిద్ధాంతమే కారణమ న్నారు. మోడీ, నడ్డా సారథ్యంలో పార్టీ మరింత ముందుకు వెళ్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నియంత, అరాచక, కుటుంబ పాలన కొనసాగుతోందని విమర్శించారు. నమ్మిన సిద్ధాంతాల కోసం పోరాడే కార్యకర్తలే బీజేపీకి బలమన్నారు.
రాష్ట్రంలో కుటుంబ పాలనను అంతమొందించేందుకు కార్యకర్తలు కంకణం కట్టుకోవాలని పిలుపిచ్చారు. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక పాలనపై ప్రతి గ్రామం తిరిగి ఎండగడ తామని బండి సంజయ్ స్పష్టం చేశారు.