Begin typing your search above and press return to search.

సంజయ్ సంచలనం.. గ్రేటర్ లో బీజేపీ గెలిస్తే పోలీసులకు 15 నిమిషాలు స్వేచ్ఛనిస్తారట

By:  Tupaki Desk   |   30 Nov 2020 10:30 AM IST
సంజయ్ సంచలనం.. గ్రేటర్ లో బీజేపీ గెలిస్తే పోలీసులకు 15 నిమిషాలు స్వేచ్ఛనిస్తారట
X
హైదరాబాద్ నగర చరిత్రలో తాజాగా జరుగుతున్న గ్రేటర్ ఎన్నికలు ప్రత్యేకంగా నిలిచిపోవటం ఖాయం. ఇప్పటివరకు నగరపాలక సంస్థకు ఎన్నో ఎన్నికలు జరిగినా..ఈ ఎన్నికల సమయంలో తెర మీదకు వచ్చిన అంశాలు.. పార్టీల మధ్య నడిచిన మాటల యుద్దం గతంలో ఎప్పుడూ చూసింది లేదు. ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ ప్రస్తావించని కొన్ని అంశాల్ని బీజేపీ నేతలు తెర మీదకు తీసుకొచ్చారు.

మాట వరసకు కూడా చర్చకు రాని అంశాల్ని ఎన్నికల వేళ ప్రత్యేకంగా మాట్లాడుకునేలా చేయటమే కాదు.. చర్చనీయాంశంగా మార్చిన వైనం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పాలి. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొన్ని సంచలన అంశాల్ని తెర మీదకు తీసుకొచ్చారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో నివసించే హిందువులు ఆ ప్రాంతాల నుంచి వెళ్లిపోయారని.. వారంతా ఎక్కడకు వెళ్లారని ప్రశ్నిస్తున్నారు.

హైదరాబాద్ లోని శాలిబండ.. అలియాబాద్.. ఉప్పుగూడ.. లాల్ దర్వాజ.. గౌలిపుర.. ఛత్రినాక లాంటి ప్రాంతాల్లో ఉండాల్సిన హిందువులు ఎక్కడకు పోయారని ప్రశ్నించారు. వారి ఆస్తుల్నికబ్జా చేశారన్న బండి సంజయ్.. గ్రేటర్ లో తాము గెలిస్తే .. మేయర్ గా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఆయా ప్రాంతాల నుంచి వెళ్లిపోయిన వారిని వారి సొంత ఇళ్లకు తిరిగి రప్పిస్తామన్నారు. పాతబస్తీలో హిందూ జనాభానను తగ్గించేందుకు కుట్ర జరుగుతుందన్నారు.

ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే.. పోలీసులకు 15 నిమిషాలు స్వేచ్ఛను ఇస్తామన్నారు. పాకిస్తాన్ కుక్కల్ని.. బంగ్లాదేశ్.. అప్ఘనిస్తాన్ రోహింగ్యా లుచ్చాలను బయటకు గుంజి తరిమేస్తామంటూ సంచలన వ్యాఖ్యలుచేశారు. భాగ్యనగరానికి బీజేపీ రక్షణ కవచంగా ఉంటుందన్నారు.