Begin typing your search above and press return to search.

అతి త్వరలో అమల్లోకి కామన్ సివిల్ కోడ్..అధినేత స్పష్టికరణ!

By:  Tupaki Desk   |   14 April 2020 12:30 PM GMT
అతి త్వరలో అమల్లోకి కామన్ సివిల్ కోడ్..అధినేత స్పష్టికరణ!
X
కామన్ సివిల్ కోడ్ .. చాలా కాలంగా బీజేపీ అమ్ముల పొదిలో వివాదాస్పద అంశం.. ఒకే దేశం.. ఒకే రాజ్యాంగం.. ఒకే చట్టం ఉండాలన్నది బీజేపీ విధానం. దీన్ని అతి త్వరలో దేశ వ్యాప్తంగా అమలు చేయడానికి కేంద్రం సన్నధం అవుతుంది అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసారు. అంబేద్కర్‌ కు నివాళులు అర్పించిన తర్వాత ఆయన కామన్ సివిల్ కోడ్ పై ఈ విధమైన వ్యాఖ్యలు చేసారు. అంబేద్కర్ ప్రవచించిన పలు అంశాలను బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం నెరవేర్చిందని అయన చెప్పారు.

బీజేపీ నినాదం - విధానం అన్ని కూడా బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచనకు అనుగుణంగా ఉంటాయని - అంబేద్కర్ ఆలోచనా విధానాల్లో భాగంగా మోదీ అనేక కార్యక్రమాలు చేపట్టారని - అంబేద్కర్ సూచనల్లో 370 ఆర్టికల్ రద్దు వుందని - అందుకే మోదీ ఆర్టికల్ 370ని రద్దు చేశారని సంజయ్ చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో కామన్ సివిల్ కోడ్ విధానం పట్ల కేంద్రం ఆలోచన చేస్తోందని ఆయన వెల్లడించారు.

అలాగే , అంబేద్కర్‌ ను కాంగ్రెస్ అవమానిస్తే బీజేపీ భారతరత్న ఇచ్చి గౌరవించిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఎస్సీ - ఎస్టీ - మైనారిటీలను కాంగ్రెస్ పార్టీ కేవలం ఓటు బ్యాంక్‌ గా చూస్తుంది అని , బీజేపీ వారి అభ్యున్నతికి పాటు పడుతుందని సంజయ్ తెలిపారు. మే 3వ తేదీ వరకు ప్రధాని మోదీ సూచన మేరకు ప్రజలందరూ లాక్ డౌన్ పాటించాలని - దేశ వ్యాప్తంగా మోదీ ముందు చూపు వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని తెలిపారు. అలాగే రాష్ట్రంలో కరోన కేసులు పెరగడానికి మర్కజ్ ప్రార్ధనలు కారణమయ్యాయని చెప్పుకొచ్చారు.