Begin typing your search above and press return to search.
బండి సంజయ్ కు అస్వస్థత.. ఎయిమ్స్ లో చేరిక?
By: Tupaki Desk | 27 Sept 2020 11:20 AM ISTతెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సడన్ గా అనారోగ్యం పాలయ్యారన్న వార్తలు కలకలం రేపాయి.. ఏమైందో ఏమో తెలియదు కానీ బండి ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారని తెలిసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పుకార్లు లేచాయి.
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కృష్ణదాస్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఆయనతో ఎంపీ సంజయ్ ప్రైమరీ కాంటాక్ట్ అయినట్లు తెలుస్తోంది. అయితే బండి సంజయ్ బాగానే ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇది వరకు ఒకసారి ఆయన కరీంనగర్ లో ఎన్నికల ప్రచారంలో ఉండగా వడదెబ్బ తగిలి ఒకసారి.. గుండెపోటు వచ్చి మరోసారి కూడా సడన్ గా అస్వస్థతకు గురయ్యాడు. అప్పుడు కార్యకర్తలు, రాష్ట్ర నాయకులు వచ్చి పరామర్శించారు. కరీంనగర్ ఆపోలో ఆస్పత్రిలో బండి సంజయ్ కు చికిత్స చేశారు. ఓ స్టంట్ కూడా గుండెకు వేసినట్టు సమాచారం.అయితే అనంతరం కరీంనగర్ ఎంపీగా.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఎదిగాడు.
తాజాగా బీజేపీ కొత్త కార్యవర్గం ఏర్పాటు కోసం ఢిల్లీలో ఉన్నారు. డీకే అరుణను జాతీయ కార్యవర్గంలోకి తీసుకోవడంలో బండి కీలక పాత్ర పోషించినట్టు తెలిసింది.తాజాగా సడెన్ గా బండి సంజయ్ అస్వస్థతకు గురయ్యారన్న వార్తలు చెలరేగడంతో బీజేపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడని ప్రచారం జరుగుతోంది. 12 రోజులుగా బండి సంజయ్ ఢిల్లీలోనే ఉంటున్నారు.
నిన్న ఉదయం దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకల్లో పాల్గొన్న బండి సంజయ్ కి సాయంత్రం ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆస్పత్రిలో చేరినట్టు తెలిసింది. దీనిపై బండి సంజయ్ అధికారికంగా స్పందించలేదు. ఆయన ఆరోగ్యం గురించి వివరాలు తెలియాల్సి ఉంది.