Begin typing your search above and press return to search.

తెలంగాణలో ఇప్పటివరకు ఎవరూ చేయని డిమాండ్ చేసిన బండి

By:  Tupaki Desk   |   20 Dec 2020 9:45 AM IST
తెలంగాణలో ఇప్పటివరకు ఎవరూ చేయని డిమాండ్ చేసిన బండి
X
మిగిలిన రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా.. మరే రాష్ట్రంలో లేని రీతిలో తెలంగాణలో కొన్ని విషయాల్లో సో స్పెషల్ అని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన ఏడాదికే.. కొత్త రాష్ట్రంలో తిరుగులేని అధినేతగా అవతరించారు టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు ఎలా అయితే.. ఆయన్ను వేలెత్తి చూపించేందుకు వెనుకాడారో.. ముఖ్యమంత్రి అయ్యాక ఆ భయం మరింత పెరిగిందే కానీ తగ్గలేదు. అంతేకాదు.. ఆయన చేసే పనుల మీదా.. తీసుకునే నిర్ణయాల మీద ముఖం మీదనే చెప్పే దమ్ము.. ధైర్యం ఎవరికి లేదు. సొంత పార్టీ నేతలకు ఎలానూ సాధ్యం కాదు. కనీసం విపక్ష నేతలైనా చేస్తారా? అంటే.. మనకెందుకులే రిస్క్ అన్నట్లుగా పలువురు వ్యవహరించేవారని చెబుతారు.

అలా ఆరేళ్ల పాటు ఆయన్ను పల్లెత్తు మాట అనేందుకు వెనుకా ముందు చూసుకునే తీరుకు భిన్నంగా.. మొహమాటం అనేది లేకుండా అదే పనిగా విమర్శల కత్తుల్ని సంధిస్తున్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను సంచలనంగా మారాయి. నిజానికి కేసీఆర్ కు సంబంధించి ఏ మాట మాట్లాడినా.. ఆ తర్వాత లేని పోని తిప్పల్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందన్న మాట రాజకీయ వర్గాల్లో తరచూ వినిపిస్తూ ఉంటుంది.

ఆ మాటలకు తగ్గట్లే.. ఆయనపై ఘాటు విమర్శలు చేసినోళ్లు కనిపించరు. అయితే.. ఇలాంటి రూల్స్ ను అదే పనిగా బ్రేక్ చేసేస్తున్నారు బీజేపీ ఫైర్ బ్రాండ్ బండి సంజయ్. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు పెను సంచలనంగా మారాయి. ‘‘కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాల్ని అవలంభిస్తున్నారు. ఒకసారి సీఎం ఫాంహౌజ్ నుతనిఖీ చేయాలన్నారు. ఆయన పదే పదే అక్కడకు వెళ్లటం పలు అనుమానాలకు తావిస్తోంది’’ అంటూ సంచలన వ్యాఖ్య చేశారు. ఎప్పటిలానే కేసీఆర్ ను జైల్లో పెట్టే రోజు త్వరలోనే వస్తుందన్నారు.

‘‘ఆయన జైలుకు పోవటం ఖాయం. కేసీఆర్ లేని తలెంగాణ కావాలని ప్రజలు భావిస్తున్నారు. ఇది బీజేపీతోనే సాధ్యం’’ అని ఫైర్ అవుతున్నారు.ఈ తరహాలో దూసుకెళుతున్న బండి దూకుడు చూస్తుంటే.. గతంలో మాదిరి ఆయన్ను లైట్ తీసుకోవటానికి వీల్లేదన్న విషాయాన్ని గులాబీ అధినాయకత్వం గుర్తిస్తే మంచిది. లేదంటే అందుకు భారీ మూల్యం చెల్లించక తప్పదు.