Begin typing your search above and press return to search.

బీజేపీలోకి విజయశాంతి.. క్లారిటీ ఇచ్చిన బండి సంజయ్

By:  Tupaki Desk   |   6 Dec 2020 11:23 AM IST
బీజేపీలోకి విజయశాంతి.. క్లారిటీ ఇచ్చిన బండి సంజయ్
X
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయం తర్వాత తెలంగాణలో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీలోకి నేతలంతా క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ కూడా బీజేపీలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

విజయశాంతి బీజేపీలో చేరికపై తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఢిల్లీ పెద్దల సమక్షంలో విజయశాంతి సోమవారం బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. ఇక జానారెడ్డి చేరికపై తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని తెలిపారు.

జీహెచ్‌ఎంసీ మేయర్‌ పదవి ఇస్తే నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని బండి సంజయ్ తెలిపారు. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చాలన్న బీజేపీ వాదాన్ని ప్రజలు సమర్థించారన్నారు. రెండు మూడు రోజుల్లో బీజేపీ కార్పొరేటర్లతో కలసి భాగ్యలక్ష్మీ దేవాలయానికి వెళ్తామని వెల్లడించారు.

2023లో అధికారంలోకి రావటమే తమ లక్ష్యమన్నారు. ఎన్నికలు హడావుడిగా నిర్వహించకపోతే.. బీజేపీ వందకు పైగా స్థానాల్లో గెలిచేదని చెప్పారు. '' బీజేపీని తక్కువ అంచనా వేసిన ముఖ్యమంత్రికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా కేసీఆర్ మారకపోతే ప్రజా ఉద్యమాలు చేస్తామన్నారు.