Begin typing your search above and press return to search.
తొక్కేనని తీసి పారేయొద్దు
By: Tupaki Desk | 23 Sept 2015 5:00 AM ISTపెద్దగా పట్టించుకోని చాలా విషయాల్లో అవసరానికి మించిన ‘విషయం’ ఉంటుంది. అరటి పండు తినే వారు.. పండు తిన్న వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా తొక్క తీసి పక్కన పడేస్తారు. తొక్కతో ఏమైనా చేయొచ్చా అన్న ఆలోచన కూడా రాదా? ఒకవేళ ఎవరైనా తొక్క గురించి చెప్పాలని ప్రయత్నిస్తే.. ‘తొక్కలో కబుర్లు చెప్పొద్దు’ అంటూ చిర్రుబుర్రులాడుతుంటారు.
కానీ.. సింఫుల్ గా తీసి పారేసే తొక్కలో ఉపయోగపడే విషయాలెన్నో ఉంటాయని తాజాగా తేలింది. తాజాగా అరటి తొక్క మీద చేసిన పరిశోధనల్లో వెల్లడైన విషయాలు చూస్తే..కాస్తంత విస్మయానికి గురి కావాల్సిందే. అరటి తొక్కలో ఉండే విశేషాలు చూస్తే..
= అరటి పండు తొక్కలో అధిక శాతం విటమిన్లు.. ఖనిజాలు.. బి6.. ఏ.. సి విటమిన్లు.. మాంగనీస్.. పొటాషియం.. పీచు పదార్థాలు.. ప్రొటీన్లు.. మెగ్నీషియం.. ప్రోటీన్లు ఉంటాయట.
= తొక్కను మెటిమల మీద రుద్దితే ఒక్క రాత్రిలోనే మటుమాయం అవుతాయట.
= ఇక.. అరటి పండు తొక్కను గుజ్జుగా చేసి ఎగ్ వైట్ లో కలిపి ముఖానికి పట్టిస్తే ముడుతలు మటుమాయం అవుతాయట.
= అరటింపడు తొక్కతో ముఖం నిగనిగలాడటం ఖాయమని చెబుతున్నారు.
= వారానికి ఒకసారి తొక్కను పంటి వరుస మీద రుద్దితే పలు వరస నిగనిగలాడటమే కాదు.. వైద్యుల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదట.
= అరటిపండు తొక్కను గుజ్జుగా చేసి వెజిటబుల్ ఆయిల్ కలిపి వాపులున్న చోట మసాజ్ చేస్తే నొప్పులు మాయమవుతాయట.
= సోరియాసిస్ వ్యాధితో వచ్చే దురదకు అరటి గుజ్జు చెక్ చెబుతుందట. దాని గుజ్జును దురద ఉన్న చోట రాస్తే తగ్గిపోతుందట.
= దోమకాటు వల్ల వచ్చే అలర్జీలు.. దురదలు వచ్చే చోట అరటి గుజ్జును కానీ రాస్తే రిలీఫ్ ఉంటుందట