Begin typing your search above and press return to search.
త్వరలో పబ్‌జీ తో సహా 275 చైనా యాప్స్ పై బ్యాన్ ?
By: Tupaki Desk | 27 July 2020 1:20 PM ISTచైనా దొంగబుద్ధిని బాగా పసిగట్టిన కేంద్ర ప్రభుత్వం చైనాకి షాక్ ఇచ్చేలా ఒక్కొక్క నిర్ణయం తీసుకుంటూ చైనా కి దిమ్మతిరిగే షాక్ ఇస్తుంది. గాల్వానా లోయ లో జరిగిన దుర్ఘట తరువాత భారత్.. చైనాపై సానుకూలంగానే స్పందించింది. పొరుగు దేశం మనకు ఎలక్ట్రానిక్స్ వస్తువులు, స్మార్ట్ ఫోన్లు అందిస్తూ మన సేవ చేస్తోంది. అలాగే మరోవైపు మన స్టార్టుప్ కంపెనీల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ప్రోత్సహిస్తోంది కదా అని మాట్లాడుకొని సమస్యని సామరస్యంగా పరిష్కరించుకోవాలని అనుకుంది. కానీ దాని వక్ర బుద్ధి ఎంత మాత్రం మార్చుకోలేదు.
ఈ నేపధ్యంలోనే ఇప్పటికే 59 చైనా ఆప్ లపై యుద్ధం ప్రకటించి వాటిని ఇండియా లో పూర్తిగా నిషేధించింది. అందులో కోట్ల కొద్దీ ఇండియన్ల మనసు దోచిన టిక్ టాక్ వంటి మొబైల్ ఆప్స్ కూడా ఉన్నాయి. తాజాగా గూఢచర్య కార్యక్రమాలకు అవకాశం ఉందని భావిస్తున్న మరో 275 చైనా కు చెందిన మొబైల్ ఆప్స్ పై ప్రస్తుతం భారత ప్రభుత్వం ఒక కన్నేసింది. వాటిలో గేమింగ్ ఆప్ పబ్ జీ, అలీబాబా గ్రూప్ నకు చెందిన అలీ ఎక్ష్ప్రెస్స్ కూడా ఉన్నట్లు సమాచారం. ఇది పబ్ జి లవర్స్ కి పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పాలి.
ఈ క్రమంలో వాటి జాబితాను తయారు చేసి ఉంచినట్లు సమాచారం. త్వరలోనే ఈ యాప్‌ల బ్యాన్‌లకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుంది. డ్రాగన్ కంట్రీపై డిజిటల్ స్ట్రైక్‌ని ప్రకటించిన భారత్.. ఆ దేశ ఆదాయానికి గండి కొట్టింది. ఇక భారత్‌ను ఫాలో అవుతూ చైనా యాప్‌లను నిషేధించాలని అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు సైతం ట్రంప్‌కు ఇటీవల లేఖ రాసిన విషయం తెలిసిందే.