Begin typing your search above and press return to search.
బాలయ్య టంగ్ స్లిప్... వైసీపీ రచ్చ చేసిందా ...?
By: Tupaki Desk | 25 Jan 2023 7:30 PM ISTనందమూరి బాలక్రిష్ణ మాట్లాడితే ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉంటుంది. ఆయన ఫ్లో అలాంటిది. అలా బాలయ్య ఎన్నో స్పీచులు ఇచ్చారు. వాటిని ఎవరూ పెద్ద సీరియస్ గా తీసుకోరు. బాలయ్య మాటల వెనక ఏముంది అని తవ్వి తీసే పరిశోధన అంతకంటే చేయరు. ఆయన మానాన మాట్లాడుతున్నారు అని ఊరుకుంటారు. కానీ గతంలో బాలయ్య టంగ్ స్లిప్ అయి అన్న మాటల కంటే ఇపుడు ఒక మాట మాత్రం ఏపీ రాజకీయాలను కుదిపేసే స్థాయిలోకి రచ్చగా మారింది.
అంటే ఇక్కడ కచ్చితంగా రాజకీయం ఉందనే అందరూ అంటున్నారు. బాలయ్య వీర సింహారెడ్డి విజయోత్సవ వేడుకల్లో యాధాలాపంగా అన్నా కూడా ఇద్దరు మహా నటుల విషయంలో నోరు జారేశారు. ఈ సంఘటన జరిగింది ఈ నెల 22 ఆదివారం రాత్రి. బాలయ్య మొత్తం స్పీచ్ అరగంటకు పైగా సాగితే అందులో ఎక్కడా ఏమీలేదు. కానీ లాస్ట్ లో మైక్ ఇచ్చేసే ముందు ఆయన ఒక నటుడితో తనకు షూటింగ్ టైం లో టైం పాస్ బాగా జరిగిందని చెప్పుకొచ్చారు.
తాము ఇద్దరం కూర్చూంటే పాతకాలం నటులూ సినిమాలు గురించే ఎక్కువగా మాట్లాడుకునేవాళ్ళం అన్నది బాలయ్య చెప్పబోయే మ్యాటర్. అయితే బాలయ్య మాటలు చిత్రంగా ఎక్కడ నుంచి ఎక్కడితో పోతాయి. అలాగే ఇది కూడా జరిగింది. అందులోనే ఆయన ఆ రంగారావు ఈ రంగారావు అన్నారు. ఇలా అనడంలో కూడా వేరే అర్ధాలు లేవు అంటున్నారు. ఆ కాలం నాటి ఎస్వీ రంగారావు నుంచి ఈ కాలం నాటి నటుల గురించి అని చెప్పడమే బాలయ్య ఉద్దేశ్యం అని అంటున్నారు.
ఇక అక్కినేని తొక్కినేని అనడం కూడా టంగ్ స్లిప్ అయి ఆయన అనేశారు. అయితే ప్రాస కోసమో ఫ్లో లో అనడమో జరిగింది తప్ప మరోటి కాదు అక్కినేని అంటే కచ్చితంగా లెజెండరీ యాక్టర్. ఆయన గురించి మాట్లాడుకున్నాం అని చెప్పబోతూ అన్ని విషయాలూ అనడానికి ప్రాసలో తొక్కినేని అనేశారు అని స్పీచ్ అంతా విన్న వారు అంటున్నారు. అది లైవ్ లో చూసిన వారికి కూడా అలాగే అర్ధం అయింది.
ఆ తరువాత సక్సెస్ మీట్ టీం కి పార్టీ కూడా జరిగింది. ఎవరూ ఆదివారం కానీ సోమవారం కానీ దాని గురించి పెద్దగా చర్చకు పెట్టలేదు. అయితే వైసీపీ అనుకూల సోషల్ మీడియాలో మాత్రం దీనిని పట్టుకున్నారు. వారికి మొత్తం స్పీచ్ అవసరం లేదు అక్కినేని తొక్కినేని, ఆ రంగారావు ఈ రంగారావు అని బాలయ్య అన్నారని మాత్రమే కావాలి. దాంతో అది ఎడిట్ చేసి ట్రోల్ చేసేసరికి మొత్తానికి మొత్తం గోల అయింది.
అలా వైసీపీ నుంచే ఈ వివాదం రాజుకుందని, దాంతో అక్కినేని ఫ్యామిలీ కూడా మంగళవారం నాటికి తమ కామెంట్ ప్రెస్ నోట్ రూపంలో రిలీజ్ చేసిందని అంటున్నారు. అదే టైం లో అక్కినేని ఫ్యాన్స్ తో డిబేట్లు కూడా పెట్టేశారు. మరో వైపు కాపు నాడు పేరిట అల్టిమేటం బాలయ్యకు వెళ్ళింది. ఇలా చాలా స్పీడ్ గా కధ మొత్తం మారడం వెనక కచ్చితంగా అధికార వైసీపీ ఉంది అని తెలుగుదేశం నాయకులు అంటున్నారు.
బాలయ్య అంటే భోళా అని సరదాగా ఆయన మాట్లాడుతారని, ఎవరి మీద ఇంటెన్షన్ ఉండదని, పైగా మహానటులను ఆయన గౌరవిస్తారని బాలయ్య సన్నిహితులు అంటున్నారు. తెలుగు సినిమా ఓల్డ్ జనరేషన్ గురించి ఆయనకు తెలిసినంతంగా ఎవరికీ తెలియదు అని కూడా అంటారు. కానీ ఏపీలో రాజకీయం వేరుగా ఉంది. సామాజిక సమీకరణలు కూడా మారుతున్నాయి.
దాంతో కాపు కమ్మల మధ్యన ఎడం తీసుకురావడానికి అన్నట్లుగా ఈ వివాదాన్ని పెంచారని అంటున్న్నారు. నిజానికి బాలయ్య అన్నది ఒప్పు అని ఎవరూ అనరు కానీ ఆయన ఉద్దేశ్యం పూర్వకంగా అనలేదని మాత్రమే అంటున్నారు కానీ దీనికి రాజకీయ రంగు పులికి రచ్చ చేయడం ఎస్వీయార్ కులం ఏమిటో తెలియకపోయినా ఆ మహానటుడికి కులం ఆపాదించి మరీ రచ్చచేయించారు అని అంటున్నారు. మరి దీని వల్ల ఇపుడు తెలుగుదేశం ఇరుకున పడిపోయింది. కౌంటర్ ఎంత ఇచ్చినా మ్యాటర్ చాలా దూరం వెళ్ళిపోయింది.
దాంతో అంతా కిందా మీదా అవుతున్నారు. మరి దీనికి ఎలా తెర దించాలన్నది ఇపుడు బాలయ్య టీం మీదనే ఉంది అంటున్నారు. మొత్తానికి రాజకీయాలు వేడెక్కిన వేళ అంతా సున్నితమైన పరిస్థితులు ఉన్న వేళ బాలయ్య లాంటి సీనియర్ జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉందని మాత్రం అంటున్నారు. సోషల్ మీడియా యుగంలో క్షణాల్లో మంట అంటుకుంటుంది. ఆ తరువాత ఎటు నుంచి ఎవరు రాజకీయం తిప్పినా కూడా అన్న వారిదే తప్పు అవుతుంది. సో ముందే జాగ్రత్త పడడం మంచింది అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.