Begin typing your search above and press return to search.

అవును లడ్డూ ధర.. రూ.10.32లక్షలు

By:  Tupaki Desk   |   27 Sept 2015 12:32 PM IST
అవును లడ్డూ ధర.. రూ.10.32లక్షలు
X
వినేందుకు విచిత్రంగా ఉన్నా నిజం. భక్తి పారవశ్యంతో నిర్వహించే వినాయక మహోత్సవాలు.. ఆ స్థాయి దాటిపోయి వ్యక్తి హోదాల దశకు చేరుకున్న పరిస్థితి. వినాయక చవిత సందర్భంగా ఏర్పాటు చేసే మండపాల్లో వినాయకుడి చేతిలో ఉంచే లడ్డూ ధరలు వేలంలో భారీ స్థాయిలో పలకటం తెలిసిందే. పేరుకు లడ్డూలే అయినా లక్షల రూపాయిలు పలికే వీటి ధరలో సరికొత్త రికార్డు తెరపైకి వచ్చింది.

హైదరాబాద్ మహా నగరంలో ఏర్పాటు చేసే లక్షలాది పందిళ్లలో బాలాపూర్ గణేష్ లడ్డూకు ఉండే క్రేజ్ వేరు. ఈ లడ్డూను సొంతం చేసుకోవటానికి లక్షలాది రూపాయిల్ని ఖర్చు చేసేందుకు సైతం సిద్ధం అవుతుంటారు. తాజాగా ఈ లడ్డూ వేలం సరికొత్త రికార్డును సృష్టించేలా చేసింది.

ఈ రోజు నిర్వహించిన వేలంలో ఇప్పటివరకూ ఉన్న రికార్డుల్ని బద్ధలు చేస్తూ.. రూ.10.32లక్షల ధర పలికింది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సాగిన వేలంపాటలో బాలాపూర్ లడ్డూను చేజిక్కించుకునేందుకు భారీ పోటీ చోటు చేసుకుంది. చివరకు కళ్లెం మదన్ మోహన్ రెడ్డి ఈ లడ్డూను రూ.10.32లక్షలకు వేలం పాడి సొంతం చేసుకున్నారు. బాలాపూర్ లడ్డూ వేలాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరు కావటం గమనార్హం. ఒక లడ్డూ కోసం లక్షలాది రూపాయిల్ని ఖర్చు చేసేందుకు సిద్ధం అవుతుంటే.. భారీ స్థాయిలో జనాలు రాకుండా ఉంటారా..?