Begin typing your search above and press return to search.

కలిసి భోజనం చేయడం ఆ ప్రముఖుడ్ని బలి తీసుకుందట

By:  Tupaki Desk   |   24 July 2020 5:20 PM IST
కలిసి భోజనం చేయడం ఆ ప్రముఖుడ్ని బలి తీసుకుందట
X
బాలల హక్కుల సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న అచ్యుతరావు బలి కావటం పలువురిని షాకింగ్ కు గురి చేసింది. సామాజిక అంశాల్లో చురుగ్గా వ్యవహరించే ఆయన కరోనాతో మరణించటంతో అయ్యో అనిపించేలా చేసింది. వ్యక్తిగతంగా చాలా జాగ్రత్తలు తీసుకునే అచ్యుతరావుకు కరోనా ఎలా సోకిందన్నది చాలామందికి ఫజిల్ లా అనిపించింది. అయితే.. ఈ విషయం మీద లోతుగా పరిశీలన జరిపితే.. ఆసక్తికర విషయాలే కాదు.. కరోనా వేళ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని చెప్పకనే చెప్పేస్తుందని చెప్పాలి.

ఇప్పటి రోజుల్లోనూ ఉమ్మడి కుటుంబానికి గుర్తుగా అచ్యుతరావు ఫ్యామిలీని చెబుతారు. నలుగురు అన్నదమ్ములు కలిసే ఉంటారు. వీరి కుటుంబంలో ఒక అలవాటు ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరు ఎక్కడ ఉన్నా.. రాత్రి అయ్యేసరికి మాత్రం తప్పనిసరిగా అందరూ కలిసే డిన్నర్ చేయాలన్న నియమం ఉంది. అదే వారి కొంప ముంచినట్లుగా చెబుతున్నారు. అచ్యుత రావు కుమారుడు కొవిడ్ బారిన పడటం.. అతనికి రోగ లక్షణాలు కనిపించకపోవటం.. పెద్ద తప్పిదానికి కారణమైందంటున్నారు.

ఎప్పటిలానే కరోనా టైంలోనూ కుటుంబ నియమమైన కలిసి భోజనం చేయటాన్ని ఫాలో కావటం అచ్యుత రావు ప్రాణాలు తీసేలా చేసిందన్న మాట వినిపిస్తోంది. అచ్యుతరావు నలుగురు అన్నదమ్ములు డిన్నర్ సమయానికి వారింటికి వచ్చేవారు. అచ్యుతరావు కుమారుడికి కరోనా స్వల్ప లక్షణాలు ఉండటం.. తెలీకుండానే కుటుంబ సభ్యులందరికి చాపకింద నీరులా ప్రవేశించింది. దీంతో కుటుంబం మొత్తం కరోనా బారిన పడినట్లుగా తెలుస్తోంది. మిగిలినవారంతా కోలుకుంటే.. అచ్యుతరావు మాత్రం ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.