Begin typing your search above and press return to search.

పెద్దల్లుడుతో పోలిస్తే చిన్నల్లుడు ముదురే

By:  Tupaki Desk   |   14 March 2019 7:25 AM GMT
పెద్దల్లుడుతో పోలిస్తే చిన్నల్లుడు ముదురే
X
లోకేష్‌తో పోలిస్తే బాలకృష్ణ చిన్నల్లుడు చాలా డేర్‌ అనే విషయం ఇప్పుడిప్పుడే జనాలకు బాగా అర్థం అవుతుంది. తనకు ఏం కావాలి అది ఎలా సాధించుకోవాలి అనే విషయంలో భరత్‌ చాలా క్లియర్‌ గా ఉన్నాడు అనే విషయం రీసెంట్‌ గా జరిగిన పరిణామాల్ని బట్టి చూస్తే స్పష్టంగా తెలుస్తుంది మనకు.

యాక్చువల్‌ గా ఎంవీఎస్‌ ఎస్‌ మూర్తి చనిపోయిన తర్వాత ఆయన స్థానాన్ని ఆయన మనవడు భరత్‌ కు ఇవ్వాలని అనుకున్నారు చంద్రబాబు. కానీ భరత్‌ తనకు ఎమ్మెల్సీ వద్దని విశాఖ ఎంపీగా పోటీ చేస్తానని అడిగాడు. దానికి ఎన్నికల సమయంలో చూద్దాంలే అని సమాధానం ఇచ్చారు చంద్రబాబు. కానీ ఇప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ చంద్రబాబు నుంచి ఎలాంటి సమాధానం రాకపోయేసరికి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాడు. విశాఖలో భీమిలి లేదా విశాఖ ఉత్తరం నుంచి లోకేష్‌ పోటీ చేస్తాడని.. అందువల్ల ఇద్దరు బంధువులు చాలా దగ్గరి నియోజకవర్గాల్లో పోటీ చేస్తే అందరూ అలా అడుగుతారు అనే ఉద్దేశంతో శ్రీభరత్‌ ని పక్కనపెట్టారు చంద్రబాబు. దీంతో.. చంద్రబాబు మంత్రాంగాన్ని అర్థం చేసుకున్న శ్రీభరత్‌… లోకేష్‌ ఉన్నా ఫర్వాలేదు తాను మాత్రం విశాఖ నుంచే పోటీ చేస్తానని ఒత్తిడి పెంచాడు. మామయ్య బాలయ్యతో చెప్పించాడు. అలాగే..విశాఖ పరిథిలో వచ్చే నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులతో కూడా చెప్పించాడు. లోకేష్‌ పోటీ చేసినా చేయకపోయినా తాను మాత్రం విశాఖ ఎంపీగానే పోటీ చేయాలి అని అనుకుంటున్నట్లు కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశాడు. దీంతో.. చేసేది లేక.. లోకేష్‌ ను విశాఖ నుంచి మంగళగిరికి షిఫ్ట్ చేశారు. ఇక భీమిలి నుంచి గంటా - విశాఖ ఎంపీగా శ్రీభరత్‌ పోటీ చేయడం కన్‌ ఫర్మ్‌ అయ్యింది. ఎంపీ కాకముందే చంద్రబాబు ముందే చక్రం తిప్పి తన పంతం నెగ్గించుకున్న శ్రీభరత్‌ రాబోయే రోజుల్లో మరింతగా రాణిస్తాడని అందరూ అనుకుంటున్నారు.