Begin typing your search above and press return to search.

బాలయ్య అల్లుడిది అబద్ధమా? బుక్ అయ్యాడా?

By:  Tupaki Desk   |   30 Aug 2019 1:55 AM GMT
బాలయ్య అల్లుడిది అబద్ధమా? బుక్ అయ్యాడా?
X
తమకు అమరావతి సమీపంలో భూ కేటాయింపులు జరిగినది చంద్రబాబు నాయుడు హయాంలో కాదనీ, అది కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగిందంటూ నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇన్ సైడర్ ట్రేడింగ్ లో భాగంగా రాజధాని ప్రాంతంలో ముందుగా బాలయ్య వియ్యంకుడికి భూ కేటాయింపులు జరగడం, ఆ తర్వాత ఆ భూమలను సీఆర్డీఏ పరిధిలోకి తీసుకురావడం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వచ్చింది.

ఆ ఆరోపణలపై శ్రీభరత్ స్పందించారు. తమకు భూ కేటాయింపులు జరగడానికి చంద్రబాబు నాయుడు సర్కారుకు ఎలాంటి సంబంధం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఆ కేటాయింపులన్నీ కాంగ్రెస్ హయాంలో జరిగినవని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఒక జీవో కాపీ బయటకు వచ్చింది. సీఆర్డీఏ అధికారులే దాన్ని విడుదల చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. దాని ప్రకారం.. 2015 జూలై 15న బాలకృష్ణ వియ్యంకుడికి ఏపీ ప్రభుత్వం నుంచి భూ కేటాయింపులు జరిగినట్టుగా పేర్కొన్నారు. అంటే చంద్రబాబు నాయుడు విభజిత ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయిన దాదాపు ఏడాదికి భూ కేటాయింపులు జరిగాయి. ఆ తర్వాత రెండు నెలలకే ఆ భూములను సీఆర్డీఏ పరిధిలోకి తెస్తూ మరో జీవోను ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి.

తమకు కిరణ్ హయాంలో భూ కేటాయింపులు జరిగాయని బాలయ్య అల్లుడు చెబితే, ఇప్పడు సీఆర్డీఏ అధికారుల తరఫున విడుదల అయిన జీవో కాపీలు 2015లో భూ కేటాయింపులు జరిగాయన్నట్టుగా ఉన్నాయి.