Begin typing your search above and press return to search.
మోడీని తరిమి తరిమి కొడతామన్న బాలయ్య
By: Tupaki Desk | 20 April 2018 11:57 AM ISTప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సినీ నటులు.. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ప్రత్యేక హోదా సాధనలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహిస్తున్న ఒక రోజు దీక్షలో భాగంగా బాలయ్య మాట్లాడారు.ఈ సందర్భంగా హిందీ.. తెలుగులో మాట్లాడిన ఆయన మోడీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
మోడీని శిఖండిగా అభివర్ణించిన బాలయ్య.. ఆయన్ను తరిమి తరిమి కొడతామని మండిపడ్డారు. నువ్వొక ద్రోహివి.. తరిమికొడతాం.. సామ దాన భేద దండోపాయాలు అంటారు కదా.. ఇప్పుడు చివరి దశలో ఉన్నాం. మోసం చేసిన మోడీని తరిమితరిమి కొట్టాలి. ఒక్క ఏపీలోనే కాదు దేశమంతా ఆయనపై వ్యతిరేకత ఉందంటూ బాలయ్య ఫైర్ అయ్యారు.
దీక్ష సందర్భంగా బాలయ్య చేసిన వ్యాఖ్యల్లోని కొన్ని మాటల్ని ప్రసారం చేసేవిగా లేకపోవటంతో బీప్ సౌండ్ తో రీటెలికాస్ట్ చేస్తున్నాయి కొన్ని ఛానళ్లు. వివాదాస్పద వ్యాఖ్యల్ని మహా ఇష్టంగా అదే పనిగా ప్రసారం చేసే కొన్ని ప్రముఖ దూకుడు ఛానళ్లు సైతం.. బాలయ్య మాటల్ని బీప్ చేసి వాడిన తీరు చూస్తే.. ఆయన మాటలు ఎంత తీవ్రంగా ఉన్నాయన్నది అర్థం చేసుకోవచ్చు.
బాలయ్య వ్యాఖ్యలు చూస్తే.. మోడీ.. నీకు తెలుగువాళ్ల ఘోష వినిపించట్లేదా?.. ముందు నువ్వు తెలుగు నేర్చుకో.. దానితో పాటు పెద్దల్ని గౌరవించటం నేర్చుకో.. అన్నింటికన్నా ముఖ్యంగా నీ భార్యను ప్రేమించటం తెలుసుకో అంటూ మండిపడ్డారు. బాకా ఊదేవాళ్ల మాటలు వినొద్దని.. ఏపీకి అన్యాయం చేసిన నువ్వో ద్రోహివి.. నిన్ను కొట్టి కొట్టి తరుముతాం.. బంకర్ లో దాక్కున్నా లాక్కొచ్చి బాదుతామన్నారు.
వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదన్న ఆయన అమరావతి శంకుస్థాపన రోజున రెండు చెంబులు తీసుకొచ్చి.. అందులో ఒకటి నీళ్లు.. మరోదాన్లో మట్టి తీసుకురావటం ద్వారా తమను అవమానించినట్లుగా బాలయ్య వ్యాఖ్యలు ఉన్నాయి. ఏం మా దగ్గర లేవా మట్టి.. పవిత్ర జలాలు? అని ప్రశ్నించారు.
ఏపీలోని ప్రతి పౌరుడు ఒక్కో గౌతమీ పుత్ర శాతకర్ణిలా మారి బీజేపీపైనా.. మోడీపైనా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మోడీని ఉద్దేశించి బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న వేళ.. ఆయన మాటల్ని వింటున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మోములో చిరుదరహాసం వ్యక్తం కావటం గమనార్హం.
కాగా, దీక్ష సందర్భంగా ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. కేంద్రం చేసిన వంచనకు నిరసనగా తాను దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. విభజన హామీల్లో ఒక్కటి కూడా సరిగా నెరవేర్చకుండా అంతా చేశామంటున్నారని విమర్శించారు. రాజధాని - పోలవరం - కడప ఉక్కు ఫ్యాక్టరీ - దుగరాజపట్నం పోర్టు - వెనకబడిన జిల్లాలకు ప్యాకేజీ ఇలా ఏ ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు.
మరోవైపు సీఎం దీక్షకు మద్దతుగా అన్ని జిల్లాలు, నియోజకవర్గ కేంద్రాల్లో మంత్రులు - ఎమ్మెల్యేలు ధర్మ పోరాట సంఘీభావ దీక్షలు చేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అన్ని జిల్లాల్లో మంత్రులు దీక్షలకు కూర్చున్నారు. శ్రీకాకుళంలో మంత్రి అచ్చెన్నాయుడు - విజయనగరంలో మంత్రి సుజయకృయకృష్ణరంగాగావు - విశాఖలో గంటా - అయ్యన్నపాత్రుడు - తూర్పుగోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం చినరాజప్ప - పశ్చిమగోదావరిలో కేఎస్ జవహర్ - కృష్ణాజిల్లోలో కొల్లు రవీంద్ర - దేవినేని ఉమా - గుంటూరు జిల్లాలో ప్రత్తిపాటి పుల్లారావు - ప్రకాశం జిల్లాలో శిద్ధా రాఘవరావు - నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి - చిత్తూరు జిల్లాలో అమరనాథరెడ్డి - అనంతపురంలో పరిటాల సునీత - కడపలో ఆదినారాయణ రెడ్డి - కర్నూలులో భూమా అఖిలప్రియ సంఘీభావదీక్ష చేపట్టారు. ఇక నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - టీడీపీ నేతలు - కార్యకర్తలు దీక్షలకు దిగుతున్నారు.