Begin typing your search above and press return to search.
బాలయ్య..కేసీఆర్ విషయంలో ఇదేం స్టాండ్
By: Tupaki Desk | 18 Nov 2018 10:38 AM GMTతెలంగాణలో ప్రచారానికి వస్తానని.. రోడ్ షో - బహిరంగ సభల్లో సైతం పాల్గొంటా ఇది నందమూరి బాలకృష్ణ ప్రకటన. తన సోదరుడు నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసే ముందు హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఘాట్ లో ఎన్టీఆర్ సమాధికి బాలకృష్ణతో కలిసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కూకట్ పల్లిలో తమ అన్న కూతురును గెలిపించాలన్నారు. అయితే, బాలయ్య ఈ సందర్భంగా తెలంగాణలో ఏమని ప్రచారం చేస్తారు? అసలు ఆయన ప్రచారం చేయడం సరైనదేనా? అని పలువురు చర్చించుకుంటున్నారు.
తెలంగాణ ఉద్యమం సమయంలో టీడీపీ నేతగా - సినీ పరిశ్రమ తరఫున కూడా పలు సందర్భాల్లో బాలయ్య పలు సందర్భాల్లో తన అభిప్రాయాలు పంచుకున్నారు. అయితే, అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన తదుపరి దశలో టీఆర్ ఎస్ వర్గాలతో సఖ్యత కొనసాగించారు. తన సినిమా ఓపెనింగ్ కు చీఫ్ గెస్టుగా కేసీఆర్ నే పిలుచుకున్నాడు. అనంతరం దానికి టాక్స్ మినహాయింపు కూడా సొంతం చేసుకున్నారు. తమ ఏలుబడిలో ఉన్న ఆస్పత్రికి చెందిన ప్రభుత్వ స్థలాన్ని రెగ్యులరైజ్ చేయించుకున్నారు. తద్వారా భారీ స్థాయిలో ఖరీదైన మొత్తాన్ని నామమాత్రపు ధరలకు కేటాయించారు. ఇలా వివిధ రకాల ప్రయోజనాలు పొందిన బాలయ్య వివిధ సందర్భాల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. గులాబీ దళపతి కేసీఆర్ పరిపాలనను ప్రశంసించారు.
కట్ చేస్తే...ఇప్పుడు బాలయ్య అదే టీఆర్ ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. దానికి బీజంగా తన అన్న కూతురు నామినేషన్ పర్వాన్ని ఎంచుకున్నారు. ఎలాగూ తెలంగాణలో తాను ప్రచారానికి రానని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో బాలయ్యే ప్రచార బాధ్యతలు నెత్తినవేసుకునే చాన్సుంది. అలా చేస్తే...ఇన్నాళ్లు ప్రశంసల్లో ముంచెత్తిన గులాబీ దళపతి పాలనపై విరుచుకుపడటం చేయగలారా? ఒకవేళ చేస్తే...ఏమని చేయాలి అనేది ఆసక్తికరంగా ఉంది. అదే సమయంలో...తన వ్యక్తిగత అంశాల విషయంలో పొగిడిన బాలయ్య ఇప్పుడు పార్టీకి సంబంధించిన అంశాల్లో పావుగా మారుతున్నారు అనేది పలువురు చర్చించుకుంటున్నారు.