Begin typing your search above and press return to search.

అల్లుడి బర్త్ డేకు డిక్టేటర్ కేక్ కటింగ్

By:  Tupaki Desk   |   23 Jan 2016 12:55 PM IST
అల్లుడి బర్త్ డేకు డిక్టేటర్ కేక్ కటింగ్
X
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు - టీడీపీ యువనేత లోకేష్‌ బర్త్‌ డే సందర్భంగా ఆయన మామగారు.. ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ కేక్ కోశారు. రాజమండ్రిలో ఉన్న బాలయ్య అల్లుడి పుట్టిన రోజు సందర్భంగా అక్కడ కేక్‌ కట్‌ చేశారు. ఆ తరువాత ఆయన మాట్లాడుతూ లోకేశ్ వంటి అల్లుడు దొరకడం అదృష్టమన్నారు. ఆపై రాజకీయాలపై మాట్లాడారు. జీహెచ్‌ ఎంసీ ఎన్నికల్లో ప్రచారంపై హైదరాబాద్‌ వెళ్లాక నిర్ణయం తీసుకుంటానని ఆయన అన్నారు. 100వ చిత్రానికి ప్రత్యేక ప్లాన్‌ అంటూ ఏమీ లేదని ఆయన చెబుతూనే... మంచి కథతో 100వ చిత్రం చేస్తానని నందమూరి బాలకృష్ణ అన్నారు.

కాగా నారా లోకేష్‌ తన పుట్టినరోజును కుటుంబసభ్యుల మద్య జరుపుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. పుట్టినరోజు వేడుకలు పూర్తి అయన వెంటనే సాయంత్రం 4 గంటలకు ఆయన ఏపీ టీడీపీ నేతలతో భేటీ కానున్నారు. ఈ భేటీలో గ్రేటర్‌లో ఏపీ నేతల ప్రచారంపై చర్చిస్తారని తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల పోలింగ్ దగ్గరపడడంతో స్పీడు పెంచాలని లోకేశ్ నిర్ణయించినట్లు సమాచారం.