Begin typing your search above and press return to search.
బాలయ్య గెలవడం కష్టమే అంటున్నారు
By: Tupaki Desk | 8 April 2019 9:50 AM ISTగత ఎన్నికల్లో తెలుగుదేశం స్టార్ క్యాంపైనర్ గా ఉన్న నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యాడు. ఇప్పుడు అక్కడ ఆయన గెలుపు కూడా కష్టమంటున్నారు. ఎం.ఎల్.ఏ కాకముందు సంవత్సరానికి ఒకటీ ఆరా సినిమాలు చేస్తూ వచ్చిన బాలకృష్ణ.. హిందూపురం నుంచి ఎం.ఎల్.ఏ గా గెలిచాక స్పీడ్ పెంచాడు. ముఖ్యంగా గత ఏడాది కాలంగా ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 1 - పార్ట్ 2 కోసం ఫుల్ బిజీ అయిపోయాడు. నియోజక వర్గ ప్రజలకు పూర్తిగా దూరమయ్యాడు.
దానికితోడు.. తరచూ ఎవరో ఒకరిపై చేయి చేసుకుంటూ వార్తలకి ఎక్కుతున్నాడు. ఆ మధ్య ఏకంగా ఓ మీడియా పర్సన్ పై దాడి చేసి.. ఆపై క్షమాపణ కోరిన బాలకృష్ణ.. తాజాగా ఓ అభిమానిపై చేయి చేసుకున్నాడు. ఆ మధ్య.. తనకు మెజారిటీ తగ్గితే.. స్థానిక నాయకుడి పీక కోస్తాననడం కూడా వివాదాస్పదమైంది. దాంతో బాలకృష్ణను మళ్ళీ గెలిపించాలా వద్దా అని హిందూపురం ప్రజలు తర్జనభర్జన పడుతున్నారని అంటున్నారు. తెలుగుదేశం వర్గాలు కూడా బాలయ్య వైఖరితో విసిగిపోయారని, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప బాలకృష్ణ గెలవడం కష్టమే ఆనుతున్నారని తెలుస్తోంది.