Begin typing your search above and press return to search.

కొడాలి నానిపై కొదమసింహంలా విరుచుకుపడ్డ బాలక్రిష్ణ

By:  Tupaki Desk   |   6 Jan 2021 12:07 PM GMT
కొడాలి నానిపై కొదమసింహంలా విరుచుకుపడ్డ బాలక్రిష్ణ
X
ఇన్నాళ్లు వైసీపీ తరుఫున మంత్రి కొడాలి నాని విరుచుకుపడుతుంటే అంతటి పౌరుషం.. భావజాలం.. తిట్ల దండకం లేక టీడీపీ బ్యాచ్ వెలవెలబోయింది. కానీ ఇప్పుడొచ్చాడు మన నటసింహం.. కొదమసింహంలా చెలరేగిపోయాడు. ఏపీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై కొదమసింహంలా విరుచుకుపడ్డాడు.

బుధవారం హిందూపురంలో పర్యటించిన ఎమ్మెల్యే కం హీరో బాలక్రిష్ణ మీడియాతో మాట్లాడారు. మంత్రి కొడాలి నానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం జగన్ పైనా విరుచుకుపడ్డారు.

ఏపీ మంత్రి కొడాలి నానిపై బాలయ్య మండిపడ్డారు. వ్యవస్థలో చట్టాలున్నాయని.. న్యాయమంటూ ఒకటి ఉందని.. లెక్కలేకుండా కొందరు అనుచితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకోవడం మంచిది కాదని అన్నారు.

ఈ సందర్భంగా ‘మొన్న ఒకాయన తమ్ముడు పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. దీన్ని ఆయన పేకాటలో దొరికితే ఏమవుతుంది? జైలుకు పోతారు.. 10వేల జరిమానా పడుతుతుంది అనడం ఎంత దారుణం’ అంటూ పరోక్షంగా మంత్రి కొడాలి నానిపై బాలయ్య కౌంటర్లు వేశారు. టీడీపీ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.

‘నా సహనాన్ని పరీక్షించొద్దు.. ఉరికే నోరు పారేసుకోవడానికి నేను వట్టి మనిషిని కాదు.. అవసరమైతే చేతలు కూడా చూపిస్తా.. తస్మాత్ జాగ్రత్త’ అని బాలయ్య హెచ్చరించారు.

ఏపీలో వరుసగా జరుగుతున్న విగ్రహామూర్తులపై జరుగుతున్న దాడులపై బాలక్రిష్ణ స్పందించారు. ఈ వ్యవహారాన్ని పూర్తిగా ఖండించటమే కాదు.. విగ్రహాల్ని ధ్వంసం చేస్తున్న వారి చేతులు ఖండించాలన్నారు. ఇప్పటివరకు 140 గుళ్ల మీద అనేక రకాలైన దాడులు జరిగాయన్నారు.

మొత్తంగా టీడీపీ నుంచి మంత్రి కొడాలి నానిలా వాయిస్ లేదని అనుకుంటున్న సమయంలో బాలయ్య ఎంట్రీ ఇచ్చి ఇలా చెడా మడా తిట్టేయడం విశేషం.