Begin typing your search above and press return to search.
బాలయ్య ఇల్లు భూస్థాపితం..షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం?
By: Tupaki Desk | 12 Dec 2019 5:04 PM GMTతెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే - ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గురించి ఓ వార్త సో్షల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వైపు ఆయన తన రాబోయే సినిమా బిజీలో ఉంటుండగా...మరోవైపు ఆయన హైదరాబాద్ లోని నివాసం గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. హైదరాబాద్ నడిబొడ్డున, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ కు అతి సమీపంలో ఉన్న నందమూరి బాలకృష్ణ నివాసం నగరంలో పర్యటించే వారి చూపును ఆకట్టుకునే సంగతి తెలిసిందే. అయితే, త్వరలో ఆ ఇల్లును కూల్చేయబోతున్నారట. అక్కడో పేద్ద షాపింగ్ కాంప్లెక్స్ కడతారట.
నందమూరి బాలకృష్ణ నివాసం ఇటు ఫిల్మ్ నగర్ వెళ్లే దారిలో అటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వెళ్లే దారిలో నడిబొడ్డున ఉంది. ఇంత ప్రైమ్ లొకేషన్ లో ఉండటం వల్ల సహజంగానే కాలుష్యం - శబ్దాలు అధికమే. అయితే, దీనికి తోడుగా ఈ దారిలో ఓ ఫ్లై ఓవర్ నిర్మాణం కానుందని ప్రచారం జరుగుతోంది. వివిధ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం రోడ్డు విస్తరణ కోసం చేపట్టే ఈ ఫ్లై ఓవర్ వల్ల బాలయ్య ఇంటిలో కొంత భాగం సదరు విస్తరణకు అందించాల్సి ఉంటుంది. ఈ ప్రచారం నేపథ్యంలో బాలకృష్ణ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విస్తరణ పేరుతో తన ఇంటి స్థలం సమర్పించుకునే బదులుగా తానే ఆ ఇంటిని కూల్చేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే బాలయ్య ఆ ఇంటికి పలు వాస్తు మార్పులు చేసినప్పటికీ...ఆయనకు కలిసిరాలేదని టాక్ ఉంది. ఇదే సమయంలో రోడ్ విస్తరణ తెరమీదకు రావడంతో....బాలయ్య తన ఇంటిని కూల్చేసేందుకు సిద్ధమయ్యారట. నగరం మధ్యలో ఉన్నందున షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఇచ్చే అవకాశం ఉందట. అయితే, ప్రస్తుత ఇంటిని కూల్చేసే బాలయ్య అదే జూబ్లీహిల్స్ లో మరో ఇళ్లు కట్టుకుంటారా లేదంటే...గత కొద్దికాలంగా ప్రముఖ నటులంతా వెళుతున్నట్లు మణికొండ వైపు వెళ్లి అక్కడ విశాలమైన గృహం నిర్మించుకుంటారా అనేది తేలాల్సి ఉంది.