Begin typing your search above and press return to search.

దేశ ప్రజలకు షాకుల మీద షాకులు ఇస్తున్న శివసేన

By:  Tupaki Desk   |   28 Nov 2019 9:18 AM GMT
దేశ ప్రజలకు షాకుల మీద షాకులు ఇస్తున్న శివసేన
X
కొంతమంది పేర్లు చెప్పినంతనే మన మనసుల్లో ఒకలాంటి ఇమేజ్ చప్పున మెదులుతుంది. అలా చూసినప్పుడు శివసేన అన్నంతనే మరాఠాలకు పెద్దపీట వేయటంతో పాటు.. కరడుగట్టిన హిందుత్వ పార్టీగా చెప్పాలి. మహారాష్ట్ర మొత్తంలో దాని ప్రభావం తక్కువ. వాస్తవానికి పార్టీని స్థాపించిన సమయంలో ముంబయి మహానగరానికి పరిమితమైన పార్టీగా చెప్పాలి. తర్వాతి కాలంలో ఆ పార్టీ పరిధి కాస్త పెరిగింది.

ఇప్పటికి మహారాష్ట్రలోని చాలా చోట్ల ఆ పార్టీ ఉనికి అస్సలు ఉండని పరిస్థితి. ఇలాంటివేళ.. అలాంటి పార్టీ అధికారంలోకి రావటం.. మొత్తం మహారాష్ట్రను పాలించే అవకాశం మరికొద్ది గంటల నుంచి షురూ కానుంది. ఈ పరిణామం ఒక ఆసక్తికరమైతే.. తాను పవర్లోకి వచ్చేందుకు.. తనకేమాత్రం పొసగని పార్టీలతో జత కట్టింది సేన.

ఇదిలా ఉంటే.. తన చేతికి రానున్న పవర్ తో మహారాష్ట్రను శివసేన ఏం చేస్తుందో తెలీదు కానీ.. ప్రమాణస్వీకారం సందర్భంగా చోటు చేసుకుంటున్న సిత్రాలు మాత్రం దేశ ప్రజలకుషాకులుగా మారాయని చెప్పాలి. శివసేనకు.. ద్రవిడుల ప్రయోజనాలు..హక్కుల కోసం పోరాడే డీఎంకే పార్టీ మధ్య రిలేషన్ వినటానికే విచిత్రంగా ఉందని చెప్పాలి. ఒకప్పుడు నిప్పు.. ఉప్పు లాంటి ఈ రెండు పార్టీలు ఉండేవి.

అలాంటిది ఇప్పుడు ఉద్దవ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్న వేళ.. ఆ కార్యక్రమానికి డీఎంకే అధినేత సాల్టిన్ పాల్గొనటం ఆసక్తికరమైనదిగా చెప్పక తప్పదు. ఇలాంటివి కలలో కూడా ఊహించలేని అంశంగా చెప్పాలి. శివసేన కార్యక్రమానికి డీఎంకే అధినేత హాజరు అవుతున్నారన్నది వినేందుకే విచిత్రంగా ఉందని చెప్పాలి.

ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పేరు వింటే చాలు కస్సుమనే శివసేన.. ఇప్పుడు అదే పార్టీతో జత కట్టటం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇలాంటివేళ.. మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఒకే పోస్టర్ మీద బాల్ ఠాక్రే.. కాంగ్రెస్ ఉక్కుమహిళగా చెప్పే ఇందిరాగాంధీల ఫోటోలు ప్రింట్ చేసిన ఫ్లెక్సీల్ని ముంబయి వీధుల్లో ఏర్పాటు చేయటం ఆసక్తికరంగా మారింది. సేన చేతికి పవర్ రావటం ఏమో కానీ.. ఇలాంటి చిత్ర విచిత్రమైన షాకుల్ని ఆ పార్టీ బోలెడన్ని ఇస్తుందని చెప్పక తప్పదు.