Begin typing your search above and press return to search.

ప్రేమికులకు భజరంగ్ దళ్ గుడ్ న్యూస్

By:  Tupaki Desk   |   8 Feb 2020 4:30 PM GMT
ప్రేమికులకు భజరంగ్ దళ్ గుడ్ న్యూస్
X
ప్రతీ ఫిబ్రవరి 14.. ప్రేమికుల దినోత్సవం వచ్చిందంటే చాలు ప్రేమికులు తన్మయత్వంతో పండుగ చేసుకుంటారు. పార్కులు, మల్టీప్లెక్స్ లు సహా ఏకాంత ప్రదేశాల్లో సేదతీరుతారు. అయితే అదేరోజు హిందుత్వ భజరంగ్ దళ్ నాయకులు ప్రేమికులను దొరికబట్టి పెళ్లిళ్లు జరిపిస్తుంటారు. ప్రతీసారి ఈ తంతు భయంతో ప్రేమికులు ఆరోజునే జరుపుకోని పరిస్థితి.

అయితే తాజాగా ఈ వాలైంటెన్స్ డేకు శుభవార్తను చెప్పాయి భజరంగ్ దళ్, విశ్వహిందుపరిషత్ తదితర హిందూ సంస్థలు.. ఈ ఫిబ్రవరి 14న ప్రేమికులు కనిపిస్తే పెళ్లిళ్లు చేయమని సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. కానీ వారికి ప్రతిసారి ఇచ్చినట్టే కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తామని తెలిపారు.

ఇక ఫిబ్రవరి 14న అమరులైన పుల్వామా దాడిలో చనిపోయిన సీఆర్పీఎఫ్ జవాన్లను స్మరిస్తూ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుతామని భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ సంస్థలు తెలిపాయి. లవర్స్ తోనూ అమరులకు నివాళులర్పిస్తామని తెలిపారు.