Begin typing your search above and press return to search.
కోరెగావ్ కుట్ర కేసు : వరవరరావు కు బెయిల్ .. కండిషన్స్ అప్లై !
By: Tupaki Desk | 22 Feb 2021 4:00 PM ISTప్రముఖ రచయిత, విరసం నేత వరవరరావుకు బాంబే హైకోర్టులో ఊరట దక్కింది. మహారాష్ట్రలోని భీమా కోరెగావ్ కుట్ర కేసులో అరెస్టయి జైలు జీవితం గడుపుతున్న వరవరరావుకు న్యాయస్థానం ఎట్టకేలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హతమార్చినట్లుగా మోదీని చంపేందుకు మావోయిస్టులతో కలిసి కుట్ర పన్నారంటూ వరవరరావుతో పాటు సుధా భరద్వాజ్, గౌతం నవలఖ, వెర్నన్ గోన్ సాల్వేస్, అరుణ్ ఫెరారియాలను 2018లో పుణె పోలీసులు అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో 2 నెలల 20 రోజుల పాటు వరవరరావును గృహ నిర్బంధంలో ఉంచారు. హౌజ్ అరెస్ట్ పొడిగించాలన్న పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టివేయడంతో ఆయన్ని అరెస్ట్ చేసి పుణె తీసుకెళ్లారు.
రాజీవ్ గాంధీపై ఎల్టీటీఈ చేసిన తరహాలోనే మోదీపై దాడి చేయాలని మావోయిస్టులు ప్లాన్ వేసినట్లు మహారాష్ట్ర పోలీసులు వెల్లడించారు. మహారాష్ట్రలో భీమా కోరెగావ్ లో జరిగిన హింస కేసులో ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారించిన సమయంలో ఈ కుట్ర కోణం బహిర్గతమైంది.
అయితే కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావుకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన కుటుంబసభ్యులతో పాటు పలు ప్రజాసంఘాలు న్యాయస్థానాలను సైతం ఆశ్రయించగా.. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐ ఏ) ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని కోరుతూ వచ్చింది.
అయితే ఆయన అనారోగ్య పరిస్థితుల కారణంగా న్యాయస్థానం తాజాగా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆరు నెలల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని, ముంబయి నగరం విడిచి వెళ్లరాదని వరవరరావును హైకోర్టు ఆదేశాలు జారి చేశారు. ఆయన ఆరోగ్యం గురించి తీవ్ర ఆందోళనలో ఉన్న కుటుంబ సభ్యులు, పౌర హక్కుల సంఘాల ప్రతినిధులకు భారీ ఊరట లభించినట్లయింది.