Begin typing your search above and press return to search.
ఎర్రకోట ఘటన నిందితుడికి బెయిల్.. మళ్లీ అరెస్టు!
By: Tupaki Desk | 18 April 2021 5:30 AM GMTనరేంద్రమోడీ ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ నెలల తరబడి శాంతియుతంగా చేపట్టిన రైతుల నిరసన.. గణతంత్ర దినోత్సవం వేళ అదుపు తప్పిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఎర్రకోట వద్దకు చేరిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారడం.. కొందరు కోటవద్ద జెండా ఎగరేయడంతో ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.
అయితే.. ఈ ఘటనకు పంజాబీ నటుడు దీప్ సిద్దూ కారణమని, అతను బీజేపీ అనుకూలమైన వ్యక్తి అని విపక్షాలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 9న హర్యానాలో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును శనివారం విచారించిన ఢిల్లీ హైకోర్టు.. దీప్ సిద్దూకు బెయిల్ మంజూరు చేసింది.
అయితే.. తాజాగా ఇదే అంశంపై దీప్ సిద్దూపై భారత పురావస్తు శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో.. తీహార్ జైల్లో ఉన్న అతను బయటకు రాకముందే.. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అతన్నిమళ్లీ అరెస్టు చేశారు.