Begin typing your search above and press return to search.

బద్వేల్ బై పోల్ : వాలంటీర్లకు ఎస్ఈసీ షాక్

By:  Tupaki Desk   |   2 Oct 2021 1:30 PM GMT
బద్వేల్ బై పోల్ : వాలంటీర్లకు ఎస్ఈసీ షాక్
X
కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల చేసిన సందర్భంగా శుక్రవారం సచివాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్‌ మాట్లాడారు. ఇంటింటి ఎన్నికల ప్రచారానికి ఐదుగురికి మించి వెళ్లకూడదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్‌ వెల్లడించారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వీల్లేదు అని తెలిపారు.

నియోజకవర్గంలో 80 ఏళ్లు దాటిన 3,837 మందికి, దివ్యాంగులకు కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని కల్పించాం. కరోనా వైరస్ సోకిన వారూ ఈ సౌకర్యాన్ని పొందొచ్చు. 272 కేంద్రాల్లో 30 కేంద్రాలు సున్నితమైనవిగా గుర్తించాం. కొవిడ్‌ నిబంధనల అమల్లో భాగంగా ప్రచారంలో ద్విచక్ర వాహన, ఇతర ర్యాలీలు నిర్వహించకూడదు. నామినేషన్‌ వేసే సమయంలో అభ్యర్థితోపాటు ఒక్కరే వెళ్లాలి. బహిరంగ ప్రదేశాల్లో జరిగే సమావేశాల్లో వెయ్యి మందికి మించి, వీధులు, కాలనీల్లో నిర్వహించే సమావేశాల్లో 50 మందికి మించి హాజరుకాకూడదు. తిరుపతి ఉప ఎన్నికల సమయంలో జరిగిన ఘటనలకు సంబంధించి 6 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 20 కేసులు నమోదుచేశాం’’ అని వివరించారు

పంచాయతీ ఎన్నికల విధులకు గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు దూరంగా ఉండాలని ఉత్తర్వులు జారీ చేశారు. వాలంటీర్లుగా ఉన్న ఉద్యోగస్తులంతా ప్రభుత్వం తరపున ప్రచారం చేయకూడదు అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3లక్షల మందికి పైగా గ్రామ వాలంటీర్లు., దాదాపు 60వేల మంది గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వీరంతా ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు నేరుగా అందిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ అమలులో ఉన్నంతకాలం ఈ ఆదేశాలు అమలో ఉంటాయని ఎస్ఈసీ స్పష్టం చేశారు.