Begin typing your search above and press return to search.
బ్యాక్ టు కాంగ్రెస్..ఎక్కడా ఇమడలేక పోతున్నారా?
By: Tupaki Desk | 4 Oct 2020 8:30 AM GMTఅమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ పరిస్ధితి ఇలాగే తయారైంది. ఏ పార్టీలోను ఇమడలేకపోవటంతో చివరకు కాంగ్రెస్ పార్టీనే దిక్కని తెలుసుకున్నట్లున్నారు. అందుకనే తొందరలోనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరటానికి డిసైడ్ చేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా హర్షకుమారే మీడియాతో చెప్పారు. తాను తొందరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించటం గమనార్హం. అమలాపురం ఎస్సీ పార్లమెంటు నియోజకవర్గం నుండి హర్షకుమార్ 2004, 2009లో వరుసగా రెండుసార్లు ఎంపిగా గెలిచిన విషయం అందరికీ తెలిసిందే.
2014లో జరిగిన రాష్ట్ర విభజనతో చాలా మంది కాంగ్రెస్ సీనియర్ నేతల జాతకాలు తల్లక్రిందులైపోయినట్లే మాజీ ఎంపి రాజకీయ జీవితం కూడా మారిపోయింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ మంచి రైజింగ్ లో ఉన్న కారణంగానే రెండుసార్లు వరుసగా గెలిచారు. రెండుసార్లు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఒంటిచేత్తో పార్టీని గెలిపించిన విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 2014లో జరిగిన రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో మాజీ ఎంపి పోటి చేయలేదు. బహుశా కాంగ్రెస్ పరిస్దితేంటో బాగానే అంచనా వేసినట్లున్నారు. అందుకనే పోటికి దూరంగా ఉండిపోయారు.
ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండిపోయినా రాజకీయాల్లో మాత్రం యాక్టివ్ గానే ఉంటున్నారు. అందుకనే కాంగ్రెస్ పార్టీని వదిలేసి జై సమైక్యాంధ్రపార్టీలో చేరి పోటి చేసి ఓడిపోయారు. తర్వాత టికెట్ ఆశించి తెలుగుదేశంపార్టీలో చేరారు. అయితే టికెట్ దక్కకపోవటంతో పార్టీలో నుండి బయటకు వచ్చేశారు. ఆ తర్వాత జనసేనలో చేరబోతున్నట్లు కొంతకాలం ప్రచారం జరిగింది. కారణాలు తెలియదుకానీ జనసేనలో చేరలేదు. ఈమధ్య బిజెపిలో చేరబోతున్నట్లు మళ్ళీ ప్రచారం జరిగింది. అయితే ప్రచారం ఉత్త ప్రచారంలాగే ఉండిపోయింది. తాజాగా ఆయనే తొందరలోనే కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు ప్రకటించారు కాబట్టే ఇదే నిజమనుకోవాలి.
అసలు టీడీపీలో చేరిన తర్వాత వెంటనే ఎందుకొచ్చేశారు ? జనసేన, బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగినా ఎందుకు చేరలేదు ? ఎందుకంటే కాంగ్రెస్ సంస్క్రతి బాగా అలవాటైపోయిన వాళ్ళు ఇతర పార్టీల్లో సర్దుకోవటం అంత వీజీకాదు. కాంగ్రెస్ పార్టీల్లో నేతలకు ఉన్నంత స్వేచ్చ ఇంకేపార్టీలోను దొరకదు. ఏదో అదృష్టం కలిసొచ్చి అనంతపురం జిల్లాలో జేసి సోదరులు ఎంపి, ఎంఎల్ఏగా 2014లో గెలిచారు కాబట్టి సరిపోయింది. సో హర్ష మళ్ళీ కాంగ్రెస్ బాట పట్టడంలో చాలామందికి ఎటువంటి ఆశ్చర్యాన్ని కలిగించటం లేదు. అయితే కాంగ్రెస్ లో చేరిన తర్వాత హర్షకుమార్ భవిష్యత్తు ఎలాగుంటుందంటే ఇప్పటిలాగే ఉంటుందనటంలో సందేహం లేదు.