Begin typing your search above and press return to search.

టీడీపీ ఎంఎల్సీకి సీరియస్

By:  Tupaki Desk   |   3 Dec 2020 5:30 PM GMT
టీడీపీ ఎంఎల్సీకి సీరియస్
X
తెలుగుదేశం పార్టీ ఎంఎల్సీ బచ్చుల అర్జునుడి ఆరోగ్య పరిస్దితి చాలా సీరియస్ గా ఉంది. బచ్చులకు కరోనా వైరస్ సోకటంతో ఊపిరి తీసుకోవటం కూడా కష్టంగామారింది. దాంతో కుటుంబసభ్యులు వెంటనే ఎంఎల్సీని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్ళారు. కొద్ది రోజులుగా అర్జునుడికి ఆయాసం, జ్వరం, ఒళ్ళు నొప్పులు వస్తున్నట్లు సమాచారం. అయితే ఈరోజు హఠాత్తుగా ఊపిరి తీసుకోవటం కూడా కష్టమైపోయిందిట.

కనిపిస్తున్న లక్షణాలను బట్టి అర్జనుడికి కరోనా వైరస్ సోకిందని డాక్టర్లు విజయవాడలో నిర్ధారణ చేశారు. కొద్ది రోజుల క్రితం కూడా అర్జునుడికి కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. అప్పట్లో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి అవసరమైన చికిత్స చేయించుకున్నారు. కొద్ది రోజులు ఆసుపత్రిలోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత పరీక్షలు చేయించుకున్నారు. ఆ పరీక్షల్లె నెగిటివ్ రిజల్టు రావటంతో కరోనా తగ్గిందని డిస్చార్జి చేశారు.

అయితే మళ్ళీ అదే సమస్య తిరిగబెట్టడంతో ఇపుడు కండీషన్ సీరియస్ అయిపోయింది. ఈమధ్యనే టీడీపీ మాజీ ఎంఎల్ఏలు డీఏ సత్యప్రభ, వైటీ రాజా కూడా కరోనా వైరస్ కారణంగానే మరణించిన విషయం తెలిసిందే. అలాగే మరో ఎంఎల్సీ బుద్ధా వెంకన్న లాంటి మరికొందరు నేతులు కూడా కరోనా వైరస్ భారిన పడినా తర్వాత కోలుకున్నారు. తాజాగా వైసీపీ ఎంఎల్ఏ కారుమూరు నాగేశ్వరరావు కూడా కరోనా వైరస్ భారిన పడటం సంచలనంగా మారింది.

ఎంఎల్ఏకి కరోనా నిర్ధారణ అయ్యే సమయానికే మంత్రులు, ఎంఎల్ఏలు, ఉన్నతాధికారులు, పార్టీ నేతలతో కలిసి తిరుగుతునే ఉన్నారు. తనకు వైరస్ సోకిందని తెలియగానే వెంటనే హోం ఐసోలేషన్లోకి వెళ్ళిపోయారు. తాను వెళ్లిపోవటమే కాకుండా తాను కలిసిన వాళ్ళందరు కూడా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, హోం ఐసొలేషన్లోకి వెళ్ళిపోవాలని పిలుపివ్వటం గమనార్హం. చివరగా చంద్రబాబు ప్రభుత్వంపై మండిపోయారు. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు కూడా ప్రభుత్వం చేయించటం లేదంటూ రెచ్చిపోయారు.