Begin typing your search above and press return to search.

వల్లభనేని వంశీ పిరికోడా ?

By:  Tupaki Desk   |   21 Jun 2020 8:10 AM
వల్లభనేని వంశీ పిరికోడా ?
X
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పై టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మండిపడ్డారు. టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి ..పార్టీ పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. అందరి భవిషత్తును ప్రజలు నిర్ణయిస్తారని, అంతవరకు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని వంశీకి హితవు పలికారు. ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు.

వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయ లేదని, అతన్ని పార్టీనే సస్పెండ్‌ చేసిందని బచ్చుల అర్జునుడు శనివారం ధ్వజమెత్తారు. మచిలీపట్నం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అభ్యర్థి గా వల్లభనేని వంశీ రెండు సార్లు శాసన సభ్యుడిగా గెలిచాడని, వైసీపీ లోకి వెళ్లి టీడీపీ మునిగిపోయే పడవ అని అనడం విడ్డూరంగా ఉందన్నారు. 37 ఏళ్ల కాలంలో ఎన్నో ఎదురుపోట్లను ఎదుర్కొని, ప్రజల మన్ననలను పొందిన పార్టీ టీడీపీ అని , ఒకప్పుడు వంశీ కూడా ఇదే పార్టీలో తెడ్డులా ఉన్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు వద్ద చెంచాగిరి చేశారని తెలిపారు. వంశీ అంత ధైర్యవంతుడైతే రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటెందుకు వేయలేదని నిలదీశారు. తెలుగుదేశం పార్టీని తిట్టడమే పనిగా పెట్టుకున్న వంశీ.. తన ఓటును చెల్లకుండా ఎందుకు చేసుకున్నారని ప్రశ్నించారు.