Begin typing your search above and press return to search.

షాకింగ్‌.. ఇది వింత‌ల్లోకెల్లా వింత‌.. తెలుసుకోవాల్సిందే!

By:  Tupaki Desk   |   21 Jun 2021 9:36 AM GMT
షాకింగ్‌.. ఇది వింత‌ల్లోకెల్లా వింత‌.. తెలుసుకోవాల్సిందే!
X
ఇటీవ‌ల కాలంలో శిశువుల జ‌న‌నాల్లో వింత‌లు చోటు చేసుకుంటున్నాయి. ఒకే కాన్పులో న‌లుగురు శిశువులు జ‌న్మించ‌డం.. ఇటీవ‌ల ఒకే కాన్పులో 10 మంది పుట్ట‌డం వంటివి వింత‌గా చ‌ర్చించుకున్న విష‌యం తెలిసిందే. ఇక‌, కొన్నాళ్ల కింద‌ట‌.. ఒంటి క‌న్నుతో ఓ శిశువు జ‌న్మించాడు. ఇది అప్ప‌ట్లో భారీ ఎత్తున వైర‌ల్ అయింది. అయితే.. మ‌న దేశంలో కాదులేండి. దుబాయ్‌లో ఓ శిశువు ఒంటి క‌న్నుతోనే పుట్ట‌డం అప్ప‌ట్లో తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది. ఇక‌, ఇప్పుడు ఇలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది. అయితే.. ఇది వింత‌ల్లోకెల్లా వింత‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం.

కర్ణాటకలో ఓ వింత శిశవు జన్మించింది. ఒకే కాలుతో ఉన్న ఆ శిశువు ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. కర్ణాటక హుబ్లీలోని కిమ్స్ ఆసుపత్రిలో ఒక కాలితోనే శిశువు జన్మించిన ఘటన వెలుగుచూసింది. ప్రసవ వేదనతో బాధపడుతు న్న ఒక మహిళను బంధువులు ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు సిజేరియన్ చేసి అనంతరం పుట్టిన శిశువును చూసి ఆశ్చర్య పోయారు. ఒకే కాలుతో జన్మించిన శిశువు నడుము కింద ఒక కాలు తప్ప సాధారణ శరీర భాగాలేమీ లేకుండానే ఉండ‌డంతో తొలుత వైద్యులే ఆశ్చ‌ర్య పోయారు.

అరుదైన శిశువు ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మ‌న దేశంలో ఇలాంటి శిశువు జ‌న్మించ‌డం ఇదే తొలి ఘ‌ట‌న అని వైద్యులు తెలిపారు. జ‌న్యుప‌ర‌మైన లోపాల‌తోనే ఇలాంటివి జ‌రుగుతుంటాయ‌ని వైద్యులు తెలిపారు. శిశువు ఆరోగ్యంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇదిలావుంటే, మరో ఘటనలో అసోంకు చెందిన ఓ మహిళ 5.2 కిలోల బరువున్న శిశువుకు జన్మనిచ్చిం ది. బాల భీముడి జననం.. మ‌రో వింత‌గా మారింది. ఇలాంటి వి సాధార‌ణ‌మే అయినా.. మ‌న దేశంలో ఇంత బ‌రువుతో జ‌న‌నాలు త‌క్కువే. అసోం సిల్చార్లో జయదాస్ అనే మహిళ ఏకంగా 5.2 కిలోల బరువున్న బాలుడికి జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బాల భీముడైన శిశువు ఆరోగ్యం మెరుగ్గానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.