Begin typing your search above and press return to search.

బాబు సీరియస్ దీక్ష.. తమ్ముళ్ల పిచ్చ కామెడీ

By:  Tupaki Desk   |   15 Nov 2019 6:28 AM GMT
బాబు సీరియస్ దీక్ష.. తమ్ముళ్ల పిచ్చ కామెడీ
X
ఒక నిరసన అంటే ఎలా తెలుపాలి.? అంటే మన బాధ అనేది అందులో ప్రస్ఫూటించాలి. సమస్యను ఎలుగెత్తి చాటాలి.. అది చూడగానే అరె వీళ్ల సమస్యను తీర్చేయాలి రా అనిపించాలి.. ఉదాహరణకు తెలంగాణ ఉద్యమం లాగా.. ప్రతి ఒక్కరి హృదయాల నుంచి ఆకాంక్షల నుంచి వచ్చిన ఆ కోరిక చివరకు నెరవేరింది. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం సీరియస్ దీక్షల ను తెగ కామెడీ చేస్తున్నారన్న చర్చ ఇప్పుడు సోషల్ మీడియా లో జరుగుతోంది.

చంద్రబాబు ఏపీ లో ఇసుక కొరత పై సీరియస్ గా విజయవాడ ధర్నా చౌక్ లో దీక్ష చేస్తున్నారు. భవన నిర్మాణ కార్మికుల కు ఉపాధి లేదని.. వారంతా ఆకలి చావులు చాస్తున్నారని తెగ స్పీచులు ఇచ్చారు. మరి అది వేదికపై కనిపించాలి కదా.. కానీ కొందరు తెలుగు తమ్ముళ్లు మాత్రం బాబు దీక్షను కామెడీ చేశారు. మొత్తం పసుపు పచ్చగా మార్చి కామెడీ పండించారు. బాబు సీరియస్ దీక్ష కాస్తా కామెడీ అయి పోయేలా చేశారు. ఇప్పుడీ చర్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు.

చంద్రబాబు ఇసుక దీక్ష వేళ ఆ సమస్య ను ప్రస్ఫూటించేలా చేయడం లో తెలుగు తమ్ముళ్ల ఉత్సాహం బూమరాంగ్ అయిపోయింది. ఇసుక కొరత తీవ్రత తెలిపిందేకు తట్టలు, ఇసుక టోపీలు, కూలీల వస్తు సామగ్రి ని దీక్షా శిబిరానికి తీసుకొచ్చారు. కామెడీ ఏంటంటే అవి సాధారణ కూలీలు వాడేవి కాదు.. వాటికి మొత్తం టీడీపీ రంగు పసుపు పచ్చ కలర్ వేసి తీసుకొచ్చారు. ఇక కూలీలను చూస్తే అయ్యో పాపం.. వీరంతా బక్క చిక్కి ఎంత బేలాగా ఉన్నారో అని అందరూ జాలిపడాలి. కానీ మన టీడీపీ నేతలు తెచ్చిన కూలీలు మాత్రం మొత్తం పసుపు చీరలు, పసుపు చొక్కాలు వేసుకొని నెత్తిన పసుపు టోపీ, చివరకు కళ్లజోళ్లు కూడా పసుపు పచ్చవే తీసుకొచ్చి చంద్రబాబు ముందే దీక్షలో కూర్చున్నారు.

ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. బాబు దీక్ష వేళ కళ్లాద్దాల పై ఇసుక కొరత నశించాలి అని రాస్తారు అని అంతా భావించారు. కానీ కామెడీ ఏంటంటే ఆ నిరసన కారుల పచ్చ కళ్లద్దాలపై ‘జై చంద్రన్న’ అని రాసి ఉంది. దీన్ని బట్టి వీళ్ల కు ఇసుక కొరత పై చిత్త శుద్ధి కంటే చంద్రబాబు ను ప్రసన్నం చేసుకోవడమే పని గా ఈ నిరసన లో పాల్గొన్నారని తెలుస్తోంది.

ఇలా టీడీపీ అధినేత ఇసుక దీక్ష వేళ అంతా పచ్చరంగు తో కూలీల వెరైటీ నిరసన నవ్వుల పాలైంది. ఈ ఫొటోలను షేర్ చేసి నెటిజన్లు తెగ ఆడేసుకుంటున్నారు. బాబు గారి మోడ్రన్ దీక్షలకు జై హో అంటూ సెటైర్లు వేస్తున్నారు..