Begin typing your search above and press return to search.
జిల్లాకు ఇద్దరు చొప్పున అలాంటోళ్లు బాబుకు కావాలట
By: Tupaki Desk | 7 Oct 2020 1:30 AM GMTరాజకీయాల్లో శాశ్విత మిత్రులు.. శాశ్విత శత్రువులు అంటూ ఉండరు. రాత్రి వరకు బండబూతులు తిట్టేసి.. తెల్లారి ముఖం కడుక్కొని భుజాన పార్టీ కండువా మార్చుకున్న నేతలు ఎందరో కనిపిస్తారు. సిద్ధాంతాలు.. విలువలు లాంటి వాటిని వదిలేసి చాలాకాలమే అయ్యింది. అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి అర్జెంట్ గా షిఫ్ట్ అయ్యే నేతలు ఈ మధ్యన ఎక్కువ అయ్యారు. ఒకప్పుడు పార్టీ మారటం అంటే.. రెండో పెళ్లి చేసుకున్నంతగా ఫీలయ్యేవారు.
ఇప్పుడు అలాంటిదేమీ లేదు. ఇన్ స్టెంట్ గా నిర్ణయాలు మార్చుకోవటం.. అధికార ఒత్తిళ్లను తట్టుకోవటానికి ఏ మాత్రం ఇష్టం లేనట్లుగా నేతలు మారారు. దీనికి కారణం లేకపోలేదు. ఒకప్పుడు రాజకీయ నేతలు రాజకీయాలు మాత్రమే చేసేవారు. ఇప్పుడు వారు పెద్ద ఎత్తున వ్యాపారాలు చేస్తున్నారు. రాజకీయంగా చిన్న తేడా వచ్చినా దాని నష్టం భారీగా ఉండటంతో వారు.. పవర్ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటున్నారు.
సార్వత్రిక ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు చంద్రబాబు రాజకీయ జీవితంలోనే అత్యంత కీలకమైనవిగా చెబుతారు. ఇప్పుడు ఎదురైన అనుభవాల్ని ఆయన అస్సలు మర్చిపోలేరంటారు. సుదీర్ఘ రాజకీయంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నా.. ఈసారి ఎదురైన పరిస్థితులు ఆయన ఎప్పుడూ ఊహించలేనివిగా చెబుతారు. అంతేకాదు.. తాను ఎవరి మీదనైతే నమ్మకం పెట్టుకున్నారో వారంతా జంప్ అయిపోతున్న పరిస్థితి. అదే సమయంలో.. వారికి పోరాడే సామర్థ్యం ఉందా? అన్న సందేహంతో ఉన్న వారు అండగా నిలవటమే కాదు.. దేనికైనా సై అన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరు ఆయనకు సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని చెబుతున్నారు.
గత ఎన్నికల్లో చాలా జిల్లాలతో పోలిస్తే.. విశాఖ జిల్లాలో పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉందనే చెప్పాలి. విపక్షంలో ఉన్న వేళలో పార్టీకి అండగా నిలుస్తారని భావించిన గంటా హ్యాండిస్తే.. ఆయనతో పాటు మరో ఇద్దరు ఆయనకు తోడు పోయినట్లుగా ఉన్నారు. ఇలాంటివేళలో.. అనూహ్యంగా వెలగపూడి రామకృష్ణబాబు పార్టీకి దన్నుగా నిలిచారు. అధికార పార్టీ నుంచి వస్తున్న తీవ్రమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటూ పార్టీకి అండగా నిలుస్తున్నారు. ఆయనకు తోడుగా సీనియర్ నేత.. ఇక పని అయిపోయిందని భావించిన అయ్యన్నపాత్రుడు చెలరేగిపోతున్నారు.
విశాఖను రాజధానిగా ప్రకటించిన జగన్ సర్కారు.. అమరావతికి అండగా నిలుస్తుందంటూ టీడీపీపై చేస్తున్న విమర్శలు బలంగా తిప్పి కొట్టటమే కాదు.. రాజధాని విషయంలో టీడీపీ వైఖరి విశాఖ వాసులకు వ్యతిరేకం కాదన్న విషయాన్ని సమర్థంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అయ్యన్న. ఇదంతా చూస్తున్నప్పుడు విశాఖలో మాదిరి మిగిలిన జిల్లాల్లో ఇద్దరు.. ముగ్గురు బలమైన నేతలు బాబుకు అండగా నిలిస్తే సరిపోతుందంటున్నారు. ఏ పరిస్థితుల్లోనూ పార్టీకి హ్యాండివ్వకుండా ఉండే నేతలు బాబు వెంట ఉంటే.. ఆయన తీరు వేరుగా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అదేమాత్రం సాధ్యమన్నది అసలు ప్రశ్న.