Begin typing your search above and press return to search.

నాపై కుట్ర.. నేను మాట్లాడలేదంటున్న బాబు మోహన్

By:  Tupaki Desk   |   8 Feb 2023 4:01 PM GMT
నాపై కుట్ర.. నేను మాట్లాడలేదంటున్న బాబు మోహన్
X
ప్రముఖ నటుడు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే అయిన బాబు మోహన్ మాట్లాడినట్టు ఉన్న ఒక ఆడియో టేప్ నిన్న తెగ వైరల్ అయ్యింది. ఒక బీజేపీ కార్యకర్తతో మాట్లాడుతూ 'బండి సంజయ్' ఎవడ్రా అంటూ మాట్లాడిన ఆడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరిన బాబు మోహన్ ఆది నుంచి తీవ్ర వ్యాఖ్యలు చేస్త వార్తల్లో నిలుస్తున్నారు. కింది స్థాయి నేతలు.. ఇతర నేతలను కలుపుకొని పోవాల్సింది పోయి ఇలా వివాదాస్పద వ్యాఖ్యలతో తరచుగా అభాసుపాలవుతున్నారన్న చర్చసాగుతోంది.

తాజాగా తన నియోజకవర్గానికి చెందిన ఆంధోల్ కార్యకర్త వెంకటరమణ ఫోన్ చేయగా బండ బూతులు తిట్టడం రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. మీతో కలిసి పనిచేస్తానని ఆ కార్యకర్త ఫోన్ చేస్తే 'నువ్వెంత నీ బతుకెంత?' అని బాబు మోహన్ దుర్భాషలాడినట్టు ఆ ఆడియోలో ఉంది.

తాను ప్రపంచస్థాయి నాయకుడిని అంటూ అతడిపై తిట్ల దండకం చదివాడు. ఓ సాధారణ కార్యకర్తగా ఫోన్ చేస్తే బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకుడు స్పందించిన తీరుతో ఖంగుతున్న సదురు బాధితుడు ఆ ఫోన్ వాయిస్ రికార్డును లీక్ చేసినట్టు తెలుస్తోంది. బాబు మోహన్ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.

ఇక 'బండి సంజయ్ ఎబడ్రా వాడు నా తమ్ముడని ఏకవచనంతో మాట్లాడడం కూడా ఫోన్ వాయిస్ లో రికార్డు అయ్యింది. అంతటితో ఆగకుండా అవసరమైతే రేపే బీజేపీకి రాజీనామా చేస్తానన్న బాబు మోహన్.. నువ్వు కావాలో.. నేను కావాలో పార్టీ తేల్చుకుంటుందని' కామెంట్స్ చేయడం ఆ ఆడియోలో ఉంది.

ఈ వ్యాఖ్యలు మీడియాలో వైరల్ కావడంతో బాబు మోహన్ స్పందించారు. 'మరుసటి రోజు మీటింగ్ ఉందని త్వరగా నిద్రపోయాను. ఆ కార్యకర్తతో మాట్లాడి రెండేళ్లవుతోంది. కావాలంటే నా ఫోన్లు చెక్ చేసుకోండి.

బండి సంజయ్ నా తమ్ముడు. ఈరోజు కూడా కలిసి భోజనం చేశాం. నా మీద కుట్ర చేసి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు' అని బాబు మోహన్ క్లారిటీ ఇచ్చారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.