Begin typing your search above and press return to search.
సిట్టింగ్‌లకు మళ్ళీ సీట్లు ఫిక్స్ చేసిన బాబు... ఆ ఇద్దరే డౌట్..?
By: Tupaki Desk | 6 Jan 2022 1:05 PM ISTఎన్నికలకు ఇంకా రెండున్నర ఏళ్ల సమయం ఉంది. కానీ ఇప్పటినుంచే 2024 ఎన్నికలని టార్గెట్ చేసుకుని చంద్రబాబు ముందుకెళుతున్నారు. మళ్ళీ గెలిచి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈ సారి ఎలాగైనా అధికారం దక్కించుకోవడం కోసం ఇప్పటినుంచే పనిచేయడం మొదలుపెట్టారు. సాధారణంగా ఎన్నికల ముందు అభ్యర్ధులని ప్రకటిస్తారు. కానీ చంద్రబాబు సరికొత్తగా ఇప్పుడే అభ్యర్ధులని ఫిక్స్ చేసేస్తున్నారు. ఒకవేళ ఎన్నికల సమయంలో ఎవరైనా అభ్యర్ధులు సరిగ్గా పనిచేయడం లేదని తెలిస్తే వారిని మార్చేస్తానని అంటున్నారు.
కానీ ఇప్పుడు ఫిక్స్ చేసిన ఇంచార్జ్‌లే వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేస్తారని చెప్పేశారు. ఆ దిశగానే బాబు పనిచేస్తున్నారు. అయితే ఇంచార్జ్‌ల విషయం పక్కనబెడితే.. సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్తితి ఏంటి ? అనేది ఒకసారి చూసుకుంటే.. టీడీపీని నలుగురు ఎమ్మెల్యేలు వీడగా, ఇప్పుడు ఆ పార్టీలో 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఆ 19 మందికి మళ్ళీ అవే సీట్లు ఫిక్స్ అయినట్లేనా అంటే ? దాదాపు సిట్టింగ్‌లకు సీట్లు ఫిక్స్ అయినట్లే అని టీడీపీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది.
ఇందులో చంద్రబాబు-కుప్పం, బాలయ్య-హిందూపురంల్లో పోటీ చేయడం ఖాయమే. ఇందులో ఎలాంటి మార్పులు లేవు. అలాగే ఉరవకొండలో పయ్యావుల కేశవ్, పర్చూరులో ఏలూరి సాంబశివరావు, అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్, కొండపిలో బాల వీరాంజనేయస్వామి, రేపల్లెలో అనగాని సత్యప్రసాద్, విజయవాడ ఈస్ట్‌లో గద్దె రామ్మోహన్, పాలకొల్లులో నిమ్మల రామానాయుడులు పోటీ చేయడం ఖాయం. ఒకవేళ గద్దే గన్నవరం నుంచి పోటీ చేసినా ఆయనకు సీటు పక్కా..!
అయితే ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజుకు మళ్ళీ సీటు ఇస్తారో లేదో డౌట్..? ఆయన ప్లేస్‌లో మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు వచ్చే అవకాశం ఉంది. ఇక రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి భవాని, రూరల్‌లో బుచ్చయ్య, మండపేటలో జోగేశ్వరరావు, పెద్దాపురంలో చినరాజప్ప, విశాఖ ఈస్ట్‌లో వెలగపూడి రామకృష్ణ, వెస్ట్‌లో గణబాబు, ఇచ్చాపురంలో అశోక్, టెక్కలిలో అచ్చెన్నలు పోటీ చేస్తారు. కానీ నార్త్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు నెక్స్ట్ సీటు మార్చుకోవచ్చు.