Begin typing your search above and press return to search.

ఈ చౌద‌రి గారు!... వ‌ర్మ‌ను వ‌దిలిపెట్ట‌ర‌ట‌!

By:  Tupaki Desk   |   29 April 2019 4:14 AM GMT
ఈ చౌద‌రి గారు!... వ‌ర్మ‌ను వ‌దిలిపెట్ట‌ర‌ట‌!
X
ఏపీలో ప్రెస్ మీట్ అంటూ ఎంట్రీ ఇచ్చి బెజ‌వాడ‌లో అడుగుపెట్టీ పెట్ట‌గానే అరెస్ట్ అయిపోయిన సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ రాంగోపాల్ వ‌ర్మ‌కు ఇప్పుడు ఓ స్ట్రాంగ్ వార్నింగ్ వ‌చ్చేసింది. బెజ‌వాడ‌లోకి ఎంట్రీ ఇచ్చిన మ‌రుక్ష‌ణ‌మే వ‌ర్మ‌ను అడ్డుకున్న బెజ‌వాడ పోలీసులు ఆయ‌న‌ను ఎయిర్ పోర్టులోనే దాదాపుగా బంధించేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అస‌లు ఏపీలో ప్ర‌జాస్వామ్యం ఉందా? అంటూ వ‌ర్మ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌న అరెస్ట్ వెనుక చంద్ర‌బాబు ప్ర‌భుత్వ‌మే ఉందన్న కోణంలో ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పిచారు. అంతేకాకుండా అస‌లు ఏ ఒక్క‌రు కంప్లైంట్ చేయ‌కుండానే వ‌ర్మ‌ను ఎలా అరెస్ట్ చేస్తార‌న్న విమ‌ర్శ‌లూ రేకెత్తాయి.

ఈ తతంగ‌మంతా గంటగంట‌కూ శృతి మించుతున్న నేప‌థ్యంలో ఓ వ్య‌క్తి ఎంట్రీ ఇచ్చారు. బెజ‌వాడ‌కు చెందిన స‌ద‌రు వ్య‌క్తి ఓ యువ లాయ‌ర‌ట‌. పేరు దేవి బాబు చౌద‌రి. టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడికి భ‌క్తుడ‌ట‌. వ‌ర్మ‌ను బెజ‌వాడ‌లో ప్ర‌వేశించ‌కుండా పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది ఈయ‌నేన‌ట‌. నేరుగా మీడియా ముందుకే వ‌చ్చిన చౌద‌రి.. వ‌ర్మ‌ను టార్గెట్ చేస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌శాంతంగా ఉన్న ఏపీలో ప్ర‌జ‌ల మ‌ధ్య చిచ్చు పెట్టేందుకు వ‌చ్చే వ‌ర్మ‌ను ఊరికే వ‌దిలిపెట్టేది లేద‌ని ఆయ‌న వ‌ర్మ‌కు డేంజ‌ర్ బెల్స్ మోగించారు. అస‌లు తాను వ‌ర్మ‌ను వ‌దిలిపెట్ట‌బోన‌ని - అస‌లు ఏపీలో వ‌ర్మ లాంటి వ్య‌క్తికి ఏం ప‌ని అని కూడా ఆయ‌న ప్ర‌శ్నించారు.

తాను చంద్ర‌బాబుకు భ‌క్తుడినేన‌ని చెప్పుకున్న చౌద‌రి... వ‌ర్మ‌కు వ్యతిరేకంగా తాను సాగించ‌బోయే ఉద్య‌మానికి మాత్రం బాబు అండ లేద‌ని వ్యాఖ్యానించారు. వ‌ర్మ‌ను పోలీసులు అరెస్ట్ చేయ‌డానికి తానే కార‌ణ‌మ‌ని కూడా చౌద‌రి చెప్పారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఎస్పీ - డీఐజీ - చివ‌ర‌కు డీజీపీకి కూడా తాను వ‌ర్మ‌పై ఫిర్యాదు చేశాన‌ని కూడా చౌద‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మొత్తంగా వ‌ర్మకు చౌద‌రి రూపంలో స్ట్రాంగ్ వార్నింగే వ‌చ్చిన‌ట్టైంది. మొత్తంగా ఈ చౌద‌రి గారితో వ‌ర్మ‌కు ఇక‌పై పెద్ద ఇబ్బంది త‌ప్ప‌ద‌న్న వాద‌న వినిపిస్తోంది.