Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ బాబ్రీ మంట‌లు...యోగీ కెలుక్కున్న‌ట్లేనా?

By:  Tupaki Desk   |   6 Feb 2020 3:30 PM GMT
మ‌ళ్లీ బాబ్రీ మంట‌లు...యోగీ కెలుక్కున్న‌ట్లేనా?
X
బాబ్రీ మ‌సీదు మంట‌లు మ‌ళ్లీ చెల‌రేగే అవ‌కాశాలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశానుసారం రామాలయ నిర్మాణానికి ట్రస్టు ఏర్పాటుచేశామని, దీనిపేరు ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం లోక్‌సభలో ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఇదే స‌మ‌యంలో....సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణ‌యం సంచ‌ల‌నంగా మారింది. బాబ్రీ మ‌సీదుకు స్థలం కేటాయించిన యోగీ స‌ర్కారు అయోధ్యకు 25 కిలోమీటర్ల దూరంలో ఈ మేర‌కు జాగా చూపించ‌డంతో...వివాదం మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది.

అయోధ్య వివాదాన్ని ప‌రిష్క‌రించ‌డంలో భాగంగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం మసీదు నిర్మాణానికి అయోధ్య జిల్లాలో ఐదెకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలం అయోధ్య పట్టణానికి 18 కి.మీ.ల దూరంలోని సోహావల్‌ మండలం ధన్నీపూర్‌ లో అయోధ్య-లక్నో హైవే పక్కన ఉన్నట్టు ప్రభుత్వ అధికార ప్రతినిధి శ్రీకాంత్‌ శర్మ తెలిపారు. ‘ఐదెకరాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మాకు మూడు ప్రత్యామ్నాయాలు సూచించింది. ఇందులో ధన్నీపూర్‌ కు మెరుగైన రవాణా సౌకర్యం ఉండటం తో ఆ ప్రాంతా న్ని ఎంపిక చేశాం’అని శర్మ చెప్పారు. గతంలో జరిగిన ఘర్షణలను, తదనంతర పరిణామాలను దృష్టి లో ఉంచుకొని స్థలాన్ని ఎంపిక చేశామని కేంద్రం తెలిపింది.

అయితే, దీనిపై ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లాబోర్డు, సున్నీ బోర్డు ఘాటుగా స్పందించాయి. ఆ ఐదు ఎకరాలను సున్నీ వక్ఫ్‌బోర్డు తీసుకున్నంత మాత్రాన దేశంలోని ముస్లింలందరూ నిర్ణ‌యాన్ని అంగీకరించినట్టు కాదని ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లాబోర్డు సభ్యుడు మౌలానా యాసిన్‌ ఉస్మాని పేర్కొన్నారు. కాగా, ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని వెంటనే పునఃసమీక్షించాలని కోరిన వ‌క్ఫ్ బోర్డు...లేదంటే మళ్లీ సుప్రీంకోర్టు తలపులను తడుతామని ప్ర‌క‌టించింది. అయితే, సున్నీ మతపెద్ద మౌలానా ఖాలీద్ రషీద్ ఫరంగి మహాలి మాత్రం అయోధ్య రామమందిరం బాబ్రీ మసీదు భూవివాదం ఇంతటి తో ముగించాల‌ని కోరారు. దీనిపై జరిగిన రాజకీయాలకు శుభం కార్డు పలకాలని వెల్లడించారు.యూపీ షియా సెంట్రల్‌ వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ రజ్వీ మాట్లాడుతూ.. మసీదు నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన ఐదెకరాల స్థలాన్ని తమకు అప్పగిస్తే అక్కడ మరో రామాలయాన్ని నిర్మిస్తామన్నారు.