Begin typing your search above and press return to search.

అయ్యో.. రామ్ దేవ్ బాబా అలా పడ్డారేంటీ! వికటించిన ఏనుగుపై ఆసనం

By:  Tupaki Desk   |   14 Oct 2020 4:00 AM GMT
అయ్యో.. రామ్ దేవ్ బాబా అలా పడ్డారేంటీ! వికటించిన ఏనుగుపై ఆసనం
X
ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ఏనుగుపై ఆసనాలు వేస్తూ అకస్మాత్తుగా కిందపడిపోయారు. అయితే ఆయనకు ఎటువంటి ప్రమాదం వాటిల్ల లేదు. ఉత్తర ప్రదేశ్లోని మథురలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటకొచ్చింది. రాందేవ్ బాబా యోగాసనాలు వేయడంలో ఎంత ప్రసిద్ధో అందరికీ తెలిసిందే. ఆయన వివిధ రకాల్లో, వివిధ భంగిమల్లో యోగాసనాలు వేయడంలో వెరీ వెరీ స్పెషల్. సోమవారం రాందేవ్ బాబా మథుర లో ఉన్న రామ్ నరేటి ఆశ్రమంలో మహావన్ ఆశ్రమానికి వెళ్లారు. ఆయన అక్కడున్న వారికి సాధారణ యోగాసనాలు కాకుండా ఏనుగు పై పద్మాసనం వేసుకుని కూర్చున్నారు.

భ్రమరీ ప్రాణాయామం చేస్తుండగా ఏనుగు ఉన్నట్టుండి కదలడంతో దాని పైన కూర్చున్న రాందేవ్ బాబా అదుపుతప్పి కిందపడిపోయారు. అయితే ఆయనకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి తీసుకున్నారు. ఎన్నో రకాల యోగాసనాలు వేస్తూ ఎంతో కీర్తి తెచ్చుకున్న రామ్ దేవ్ బాబా ఇలా ఏనుగు పై ఆసనం వేస్తూ కింద పడిపోవడంతో ప్రయోగం వికటించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఏనుగు పైనుంచి కింద పడిపోవడంతో నెటిజన్లు ట్రోలింగ్ మొదలు పెట్టారు. ఈ వీడియోకు ఇప్పటికే వేలాది వ్యూస్ వచ్చాయి. ఇదివరకు ఒకసారి ఆయన సైకిల్ తొక్కుతూ కింద పడి పోయారని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు.