Begin typing your search above and press return to search.

బాబా అమ్టే మనమరాలి సూసైడ్.. ఆ పోస్టు చేసిన గంటలకే దారుణం

By:  Tupaki Desk   |   1 Dec 2020 5:45 AM GMT
బాబా అమ్టే మనమరాలి సూసైడ్.. ఆ పోస్టు చేసిన గంటలకే దారుణం
X
ప్రముఖ సామాజిక కార్యకర్త బాబా అమ్టే మనమరాలు డాక్టర్ షీతల్ అమ్టే కారజ్గి ఆత్మహత్య ఉదంతం సంచలనంగానూ.. అంతకు మించిన షాకింగ్ గా మారింది. సమస్యలపై పోరాడే తన తాత తీరుకు.. తన జీవితాన్ని అర్దాంతరంగా ముగించటాన్ని పలువురు జీర్ణించుకోలేకపోతున్నారు. వృత్తి రీత్యా డాక్టర్ అయిన ఆమె.. తన తాత స్థాపించిన ఎంఎస్ఎస్ (సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ మహారోగి సేవా సమితి)కు సీఈవోగా వ్యవహరిస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం ట్రస్టులో అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపిస్తూ ఫేస్ బుక్ లో ఒక వీడియో పెట్టటం కలకలం రేపింది. కొద్ది గంటల వ్యవధిలోనే ఆ వీడియోను ఆమె తొలగించారు. ట్రస్టీలుగా ఉన్న కుటుంబ సభ్యులతో పాటు.. సంస్థలో పని చేసే మరికొందరు కార్యకర్తల మీద ఆమె ఆరోపణలు చేశారు. షీతల్ చేసిన ఆరోపణల్ని ఆమె కుటుంబ సభ్యులు ఖండించటం గమనార్హం.

మానసిక ఒత్తిడి.. తీవ్రమైన నిరాశ కారణంగా షీతల్ ఈ రకమైన వ్యాఖ్యలు చేసినట్లుగా వారు చెప్పారు. ట్రస్టు నిర్వహణకు బాబా అమ్టే వారసులు కట్టుబడి ఉటారని స్పష్టం చేశారు. విషాన్ని ఇంజెక్షన్ రూపంలో తీసుకోవటం ద్వారా ఆమె మరణించినట్ులగా చెబుతున్నారు. ఆమె డెడ్ బాడీని పోలీసులు స్వాధీనం చేసుకొని పోస్టుమార్టర్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈ ఆత్మహత్య ఉదంతం గురించి సమాచారం అందిన వెంటనే.. నాగపూర్ నుంచి ప్రత్యేక ఫోరెన్సిక్ నిపుణుల టీం వరోరాకు చేరుకుంది.

షీతల్ ఆత్మహత్య చేసుకోవటానికి కొద్ది గంటల ముందు ఫేస్ బుక్ లో వార్ అండ్ పీస్ అనే చిత్రాన్ని పోస్టు చేశారు. వివిధ వర్ణాలతో ఉన్న ఈ పెయింటింగ్ లోని రంగులకు భిన్నంగా ఆమె జీవితాన్ని ఎలాంటి రంగులు లేకుండా అర్థాంతరంగా ముగించటం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. తన పెయింటింగ్ కు పెట్టిన వార్ అండ్ పీస్ క్యాప్షన్ లో..యుద్ధం తర్వాతే శాంతి ఉంటుంది. కానీ.. శాంతి కోసం యుద్ధాన్ని మధ్యలో ఆపేయటం ఏమిటి షీతల్? నిజంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నారా? లేక.. ఆత్మహత్యగా చిత్రీకరించారా? అన్నది పోలీసుల విచారణలో తేలనుంది.