Begin typing your search above and press return to search.

హెచ్.సీఏ తొలగింపు: కోర్టుకు అజారుద్దీన్

By:  Tupaki Desk   |   27 Jun 2021 5:30 AM GMT
హెచ్.సీఏ తొలగింపు: కోర్టుకు అజారుద్దీన్
X
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్.సీ.ఏ) అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. ప్రతిరోజు ఏదో ఒక వివాదం చెలరేగుతూనే ఉంది. అపెక్స్ కౌన్సిల్ ఇప్పటికే హెచ్.సీ.ఏ అధ్యక్షుడిగా అజారుద్దీన్ ను తొలగించింది. తాత్కాలిక అధ్యక్షుడిని నియమించింది. ప్రస్తుత ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్ ను అపెక్స్ కౌన్సిల్ తాత్కాలిక అధ్యక్షుడిగా చేసింది.

దీనిపై అజారుద్దీన్ మండిపడ్డారు. ‘నేను ఇప్పటికీ హెచ్.సీ.ఏ అధ్యక్షుడిని అని.. అపెక్స్ కౌన్సిల్ కు తాత్కాలిక అధ్యక్షుడిని నియమించే హక్కు లేదని ’ స్పష్టం చేశారు. హెచ్.సీ.ఏ చరిత్రలో తాత్కాలిక అధ్యక్షుడు లేరు అని అజార్ స్పష్టం చేశారు.

అపెక్స్ కౌన్సిల్ లోని ఐదుగురు సభ్యులు హైదరాబాద్ క్రికెట్ లో మొత్తం వివాదానికి కారణం అని అజార్ ఆరోపించారు. ఏసీబీ కేసుల్లో ఇరుకున్న వారు ప్రతిరోజు కోర్టుకు వెళతారని.. వారు నా సమగ్రతను ప్రశ్నించడం ఆశ్చర్యంగా ఉందని అజార్ అన్నారు.

ఇక తనను తొలగించి తాత్కాలిక అధ్యక్షుడిని ఎంపిక చేసిన వైనంపై కోర్టును ఆశ్రయించాలని అజారుద్దీన్ ఆలోచిస్తున్నాడు. చట్టపరంగా ఎంపికయ్యాను.. సుప్రీంకోర్టు ఆదేశాల మరకు దేశానికి టెస్ట్ క్రికెట్ ఆడిన తాను హెచ్.సీ.ఏ అధ్యక్షుడిగా అర్హుడిని. అపెక్స్ కౌన్సిల్ ఆదేశాలు చెల్లవు అని అజార్ స్పష్టం చేశారు.

హెచ్.సీ.ఏ రాజకీయ వ్యవహారాల్లో రాజకీయ నాయకుల ప్రమేయం గురించి అడిగినప్పుడు అలాంటిదేమీ జరగడం లేదని అజార్ పేర్కొన్నారు. ఈ సీజన్ కు ముందే హెచ్.సీ.ఏలో వివాదాస్పద అభివృద్ధి గురించి క్రికెటర్లు ఆందోళన చెందుతున్నారు.